Site icon HashtagU Telugu

Raj Pakala : పోలీసుల విచారణకు హాజరైన రాజ్‌పాకల

Rajpakala attended the police investigation

Rajpakala attended the police investigation

Janwada Farm House Case : జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు విచారణకు రావాలని రెండు రోజుల క్రితం పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈరోజు మోకల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసు పై రాజ్ పాకాల హైకోర్టుల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ పాకాలకు రెండు రోజులు సమయం ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే రెండు రోజుల గడువు ముగియడంతో రాజ్ పాకాల విచారణకు హాజరుకాక తప్పలేదు. ఆయన తన అడ్వకేట్ తో పోలీసుల విచారణకు వచ్చారు.

అయితే రాజ్ పాకాల పోలీసుల విచారణలో ఏం చెప్పారు అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా, శనివారం రాత్రి జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ జరిగింది. దీనిపై పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేశారు. అక్కడ భారీ ఎత్తు విదేశీ మద్యం, క్యాసినో గేమ్ కు సంబంధించి వస్తువులు దొరికాయి. ఈ పార్టీలో పురుషులు, మహిళలు పాల్గొన్నారు. మొదటగా కేటీఆర్ కుటుంబ సభ్యులు ఈ పార్టీలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. పోలీసుల సోదాలకు 20 నిమిషాల ముందే కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లారని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి.

మరోవైపు పోలీసులు పార్టీలో పట్టుబడిన వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. మహిళలు మాత్రం పోలీసులను బుతులు తిడుతూ శాంపిల్స్ ఇవ్వలేదని తెలిసిందే. దీంతో వారిని వదిలిపెట్టారు. పురుషుల్లో విజయ్ మద్దూరి శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించారు. మూడు గంటల పాటు ఇబ్బంది పెట్టిన అతను చివరికి శాంపిల్ ఇచ్చాడు. అతనికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. తనకు రాజ్ పాకాలే డ్రగ్స్ ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత విజయ్ మద్దూరు మొబైల్ పోలీసులు స్వాధీనం చేసుకుని విడిచిపెట్టారు.

Read Also: Raghunandan Rao: ఇందిరమ్మ కమిటీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం : రఘునందన్ రావు