Pahalgam Attack : పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావారణం రాజుకుంది. ఈ తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలు, త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించినట్లు తెలిసింది. ఇక, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరి వేతకు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోడీకి రాజ్ నాథ్ సింగ్ వివరించినట్లు సమాచారం. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహన్‌తో రాజ్‌నాథ్ ఆదివారం భేటీ అయ్యారు. ఆ సమావేశంలో మన సైన్యం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను రక్షణమంత్రి నేడు ప్రధానికి వివరించారు.
Read Also: CM Revanth Reddy : జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ప్రధాని మోడీతో భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. కాగా, ఈ భేటీలో పాకిస్థాన్‌పై యుద్ధానికి ముహుర్తం ఖరారు చేయడానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత ఏం జరగబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాయాది పాక్‌పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు పహల్గాంలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన టెర్రరిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ ఇప్పటికే హెచ్చరించారు. ఉగ్రమూకలు ఏ మూలన దాక్కున్నా వెతికి వెంటాడుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మోడీ, రాజ్‌నాథ్ సింగ్ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కాగా, జమ్ముకశ్మీర్ పహల్గాం దాడితో సరిహద్దుల్లో అలజడి వాతావరణం నెలకొంది. భారత్ వైపు నుంచి దాడి ఉండొచ్చన్న అంచనాలతో పాక్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తుర్కియేకు చెందిన పలు సీ-130 హెర్క్యులస్ విమానాలు పాక్‌లో ల్యాండ్ అయ్యాయి. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్లు సమాచారం.
Read Also: Turkish Warplanes: పాకిస్తాన్‌కు టర్కీ యుద్ధ విమానాలు.. ఎందుకు ?