Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ హాజరయ్యే కార్యక్రమానికి మీడియాకు నో ఎంట్రీ అని సమాచారం అందుతోంది. మీడియాకు నో ఎంట్రీ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈరోజుసాయంత్రం బోయిన్ పల్లి నుండి నేరుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బావర్చికి రాహుల్ గాంధీ వెళతారని సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమాన్ని గోప్యంగా ఉంచుతున్న గాంధీ భవన్ వర్గాలు.. సీక్రెట్ గా రాహుల్ గాంధీ వెళ్లేలా ప్లాన్ చేస్తోందట.
బావర్చీలో విద్యార్థులు, నిరుద్యోగులతో భేటీ కానున్న రాహుల్ గాంధీ…. 6 గ్యారెంటీలపై చర్చించనున్నారట. అయితే హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ వస్తున్న తరుణంలోనే.. ఆయనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే.. హైదరాబాద్ కు రాహుల్ గాంధీ వస్తున్న తరుణంలోనే.. కాంగ్రెస్ బడా నేతలందరూ రాహుల్ గాంధీతో కలిసి వెళతారు.
మరోవైపు రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్ రానున్న ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. జోడో యాత్ర సమయంలో రాహుల్‌తో కాగడాలు చేతపట్టిన ర్యాలీ ఫోటోను సీఎం రేవంత్ పోస్ట్ చేశారు. ‘బలహీనుడి గళం, సామాజిక న్యాయ రణం, రాహుల్ గాంధీకి స్వాగతం’ అంటూ ఫోటో షేర్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని, తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు మీ బాస్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. మరికొంత మంది రాహుల్ గాంధీ అశోక్‌నగర్ రావాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
కాగా, సాయంత్రం 4.45 గంటలకు రాహుల్ గాంధీ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోని అక్కడి నుంచి పీసీసీ ఆధ్వర్యంలో బోయినపల్లిలో నిర్వహించనున్న కులగణన సదస్సుకు భారీ ర్యాలీగా వెళ్తారు. అక్కడ కులగణన విధి విధానాలు, సామాజిక న్యాయం, పలు అంశాలపై మేధావులు, ప్రజాసంఘాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. మీటింగ్ తర్వాత రాత్రి 7:10 గంటలకు రోడ్డు మార్గం గుండా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి రాహుల్ వెళ్తారు.
Read Also: Private Property : ప్రైవేటు ప్రాపర్టీల స్వాధీనంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు