TS : నేడు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్‌ గాంధీ

Election campaign: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌(Lok Sabha Election Polling) సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈనేపథ్యంలో తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్‌ ఎంపీ స్థానాల్లో కూడా గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఈక్రమంలోనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)ఈరోజు తెలంగాణ(Telangana)లో పర్యటించనున్నారు. నర్సాపూర్, సరూర్ నగర్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు రాహుల్ హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్, 6 గంటలకు సరూర్ నగర్ […]

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhi Will Visit Tel

Rahul Gandhi was elected as the Chairman of the 18th Lok Sabha Public Expenditure Committee

Election campaign: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌(Lok Sabha Election Polling) సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈనేపథ్యంలో తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్‌ ఎంపీ స్థానాల్లో కూడా గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఈక్రమంలోనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)ఈరోజు తెలంగాణ(Telangana)లో పర్యటించనున్నారు. నర్సాపూర్, సరూర్ నగర్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు రాహుల్ హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్, 6 గంటలకు సరూర్ నగర్ స్డేడియంలో నిర్వహించే సభలకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు మరోవైపు ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్​ రెడ్డి ఎక్కడెక్కడ పాల్గొంటారో పీసీసీ షెడ్యూల్​ విడుదల చేసింది. ఈ నెల పదో తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడతారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు నకిరేకల్‌లో జన జాతర సభకు హాజరవుతారు. పదో తేదీన ఉదయం 10 గంటలకు పటాన్​చెరు కార్నర్ మీటింగ్​లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మక్తల్ కార్నర్ మీటింగ్​లో ఉంటుంది.

Read Also: Prathinidhi 2 : ప్రతినిధి 2 సినిమా చూసి.. ఓటు వెయ్యమంటున్న చంద్రబాబు..

అదే రోజు సాయంత్రం 6 గంటలకు షాద్ నగర్ కార్నర్ సమావేశంలో ప్రియాంక గాంధీలతో కలిసి సభలో సీఎం పాల్గొంటారని పేర్కొంది. ఈ నెల 11 న ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఉదయం 11 గంటలకు కామారెడ్డి, మద్యాహ్నం 1 గంటకు తాండూరు ఎన్నికల సభల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు ఫుల్​ జోష్​ మీద ఉన్నారు. రానున్న మూడు రోజులు అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తుండటంపై కాంగ్రెస్​ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. మే 11 సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది.

  Last Updated: 09 May 2024, 11:10 AM IST