Funeral Cost 1655 Crores : ఆమె అంత్యక్రియల ఖర్చు 1,655 కోట్లు

బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ ఏ కార్యక్రమం  చేసినా వేల కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తోంది. మొన్న కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి రూ.2500 కోట్లు ఖర్చు చేశారు. ఇక గతంలోకి వెళితే ..2022  సెప్టెంబరు 19న  బ్రిటన్‌ దివంగత మహారాణి ఎలిజబెత్-2  అంత్యక్రియలు (Funeral Cost 1655 Crores) జరిగాయి.

  • Written By:
  • Updated On - May 19, 2023 / 09:02 AM IST

బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ ఏ కార్యక్రమం  చేసినా వేల కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తోంది. మొన్న కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి రూ.2500 కోట్లు ఖర్చు చేశారు. ఇక గతంలోకి వెళితే ..2022  సెప్టెంబరు 19న  బ్రిటన్‌ దివంగత మహారాణి ఎలిజబెత్-2  అంత్యక్రియలు (Funeral Cost 1655 Crores) జరిగాయి. ఈ కార్యక్రమం ఖర్చు వివరాలను తాజాగా  రాయల్ ఫ్యామిలీ వెల్లడించింది. ఆ అంత్యక్రియల కార్యక్రమానికి రూ.1,655 కోట్లు  ఖర్చు(Funeral Cost 1655 Crores) చేశామని ప్రకటించింది.  ఈవివరాలను గురువారం ట్రెజరీ చీఫ్‌ సెక్రటరీ జాన్‌ గ్లెన్‌ పార్లమెంటుకు సమర్పించారు. 70 ఏండ్ల పాటు బ్రిటన్‌ మహారాణి హోదాలో సేవలు అందించిన ఎలిజబెత్‌.. గత ఏడాది సెప్టెంబరు 8న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలకు వివిధ దేశాల నేతలు, ప్రతినిధులతో పాటు లక్షలాది మంది హాజరయ్యారు. 1965లో బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ అంత్యక్రియల తర్వాత అధికారిక హోదాలో బ్రిటన్‌లో క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియలు జరిగాయి.

also read : Princess Esra: యాదాద్రికి నిజాం రాణి విరాళం.. 5 లక్షల బంగారం అందజేత

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంత్యక్రియలను అప్పట్లో  రాచరికపు సంప్రదాయాలతో నిర్వహించారు. ఆమె శవపేటికపై 2,868 విలువైన వజ్రాలు, నీలమణులు, మరకత మణులు, ముత్యాలు, రూబీలు పొదిగిన రాణి కిరీటాన్ని ఉంచారు. లండన్‌లోని బర్క్‌లీ స్క్వేర్ సమీపంలోని ఓ ఇంట్లో 1926 ఏప్రిల్ 21న ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ విండ్సర్ జన్మించారు. కింగ్ జార్జి-5 రెండో సంతానమైన ఆల్బర్ట్, ఆయన భార్య ఎలిజబెత్‌లకు ఆమె తొలి సంతానం. 1936లో జార్జి-5 మరణించిన తరువాత ఆయన పెద్ద కుమారుడు డేవిడ్ ‘ఎడ్వర్డ్-8’ అయ్యారు. అయితే, రెండుసార్లు విడాకులు తీసుకున్న అమెరికా వనిత వాలిస్ సింప్సన్‌ను ఆయన పెళ్లాడారు. అయితే, రాజకీయ, మతపరమైన కారణాల వల్ల ఆమెతో వివాహాన్ని అందరూ ఆమోదించకపోవడంతో చివరకు ఆయన సింహాసనాన్ని వదులుకున్నారు. అనంతరం డ్యూక్ ఆఫ్ యార్క్ ఆల్బర్ట్ ‘కింగ్ జార్జి-6’ అయ్యారు. అప్పటికి యూరప్‌లో కొన్ని ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ కింగ్ జార్జి-6, ఆయన భార్య రాణి ఎలిజబెత్‌లు రాచరికంపై ప్రజల్లో విశ్వాసం పోకుండా చూడగలిగారు. వారి కుమార్తె ఆ వారసత్వాన్ని కాపాడారు.