Site icon HashtagU Telugu

PV Sindhu : పీవీ సింధు వెడ్డింగ్‌ రిసెప్ష‌న్‌..హాజరైన సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు..

pv-sindhu-and-venkata-sai-wedding-reception-in-hyderabad

pv-sindhu-and-venkata-sai-wedding-reception-in-hyderabad

PV Sindhu : భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో ఈ నెల 22వ తేదీన అర్ధరాత్రి 11.20 గంటలకు ఆమె పెళ్లి జరిగింది. కొద్దిమంది కుటుంబసభ్యుల నడుమ వరుడు వెంకట దత్త సాయి .. సింధు మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక తాజాగా వీరి వివాహ రిసెప్షన్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ వివాహ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.

రాజకీయ, సినిమా, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు వివాహ విందుకు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. హైదరాబాద్ ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ సమీపంలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన రిసెప్షన్‌ వేడుకకు తెలంగాణ సీఎం సీఎం రేవంత్‌ రెడ్డి హాజరై నూతన జంట సింధు, సాయిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ కొత్త జంటకు ఆశీస్సులు అందించారు. భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా.. బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు గురుసాయి దత్.. షట్లర్లు ప్రణయ్, చిరాగ్‌ శెట్టిలు పీవీ సింధు, వెంకట దత్త సాయిల రిసెప్షన్‌కు హాజరయ్యారు.

ఇక, సినీ తారలు చిరంజీవి, నాగార్జున, అజిత్‌, ఆలీ, అర్జున్, మృణాల్‌ ఠాకూర్, ఆర్కే రోజా సహా పలువురు ప్రముఖులు సందడి చేసి.. నూతన జంటను ఆశీర్వదించారు. సుజనా చౌదరి, ఏపీ జితేందర్‌రెడ్డి, చాముండేశ్వరీనాథ్, శైలజా కిరణ్‌, హరీష్‌ రావు, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, బృహతి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

BPCL: రాష్ట్రంలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ భారీ పెట్టుబడి?