Jeffrey Epstein : అతడి పేరు జెఫ్రీ ఎప్స్టీన్.. టెక్నాలజీకి మారుపేరైన అమెరికాలోని మ్యాన్‌హట్టన్ జైలులో 2019లో అనుమానాస్పద స్థితిలో ఇతగాడు చనిపోయాడు. అయినా అతడి నల్ల వ్యాపారానికి సంబంధించిన ఒక చిట్టా ఇప్పుడు బయటికి రావడంతో యావత్ ప్రపంచంలో కలకలం రేగుతోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కస్టమర్ల లిస్టులో ఎవరెవరు ఉన్నారనేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్ గోర్, బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ, విశ్వ విఖ్యాత మైఖేల్ జాక్సన్, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, బిల్ గేట్స్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని యహూద్ బరాక్ ఇతడి కస్టమర్లు. ఇలాంటి వాళ్లకు సర్వీసు చేసేంతగా జెఫ్రీ ఎప్స్టీన్ నడిపిన గొప్ప బిజినెస్ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా ? మరేం లేదు.. అతగాడు నడిపిన నీచమైన బిజినెస్ వ్యభిచార కూపం.
We’re now on WhatsApp. Click to Join.
14 ఏళ్లలోపు బాలికలు, యువతులతో జెఫ్రీ ఎప్స్టీన్ వ్యభిచార వ్యాపారం చేసేవాడు. ఒక దీవిలో జెఫ్రీ ఎప్స్టీన్‌కు(Jeffrey Epstein) ఒక ప్రైవేటు కరీబియన్ దీవి ఉండేది. బ్రిటన్‌కు చెందిన ఘిస్లెయిన్ నోయెల్ మారియన్ మాక్స్‌వెల్ అనే మహిళతో కలిసి ఈ వ్యభిచారం రాకెట్‌ను 1994లో జెఫ్రీ ఎప్‌స్టీన్ ప్రారంభించాడు. దాదాపు మూడు దశాబ్దాల పాటు వీరి దందా నిరాటంకంగా సాగింది. ఎందుకంటే సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుల స్థాయి వాళ్లే ఈ బిజినెస్‌ను కస్టమర్లుగా మారారు. ఇక మిగతాస్థాయిల వారు కూడా కస్టమర్లుగా మారిపోయి ఉంటారనేది విస్పష్టం. సాక్షాత్తూ దేశాల అధ్యక్షులు, యువరాజులు, ప్రధానమంత్రులే అతడి కస్టమర్లు అంటే.. ఎంతగా డబ్బులు సంపాదించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఆ డబ్బులను అతడు ఎన్నో అమెరికా ఆయుధాల తయారీ కంపెనీల్లో పెట్టుబడిగా కూడా పెట్టాడని అంటున్నారు.
Also Read: Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం నిర్మాణ విశేషాలు ఇవిగో
తాజాగా జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యాపార కస్టమర్ల వివరాలతో కూడిన ఒక జాబితాను సాక్షాత్తూ అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఒక కోర్టు విడుదల చేసింది. అందులో 1000 మందికిపైగా హై ప్రొఫైల్ కస్టమర్ల పేర్లు ఉన్నాయి. వారంతా జెఫ్రీ ఎప్‌స్టీన్ నిర్వహించే రిసార్టుకు వెళ్లి.. అక్కడ మైనర్ బాలికలు, యువతులతో వ్యభిచారం చేసేవారని వెల్లడైంది. ప్రపంచం ఆదర్శప్రాయులుగా భావించే స్టీఫెన్ హాకింగ్, బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ లాంటి ప్రముఖుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఈ కేసు సహ నిందితురాలు మారియన్ మాక్స్‌వెల్‌కు 2021లోనే డిసెంబరులో కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అమెరికాలో సెక్స్ ట్రాఫికింగ్‌పై పోరాడే వర్జీనియా లూయిస్ గ్యూఫ్రే అనే మహిళ కోర్టులో పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాలు బయటికి వచ్చాయి. అంతకుముందు 2006 సంవత్సరంలోనూ జెఫ్రీ ఎప్‌స్టీన్ చీకటి దందాపై అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి.