President Daupadi Murmu: భారత రాష్ట్రపతి దౌపదీ ముర్ము ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ని అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియమ్ మైవలిలీ కటోనివేర్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రస్తుతం ఫిజీ దేశ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి దౌపదీ ముర్ము ఈ అవార్డుని అందుకున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ఎక్స్‌లో పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
ఫిజీ పార్లమెంటును ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ.. ఫిజీని బలమైన సంపన్నమైన దేశంగా మార్చేందుకు భారత్ అండగా నిలుస్తుందన్నారు. దీంతో రెండు దేశాల ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఫిజీ పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలను గుర్తుచేశారు. ద్వీపదేశమైన ఫిజీలో భారతదేశ రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి.
అంతకుముందు గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన భారతీయ సోలరైజేషన్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ రెసిడెన్స్ ప్రాజెక్టు పురోగతిని మర్ము పరిశీలించారని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ముర్ము ఫిజీ పర్యటన అనంతరం న్యూజిల్యాండ్, తిమోర్- లెస్ట్‌లలో పర్యటించనున్నారు.