Site icon HashtagU Telugu

Jan Suraaj Party : కొత్త పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

Prashant Kishor announced a new party

Prashant Kishor announced a new party

Prashant Kishor : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా బిహార్‌లోని పట్నాలో అఫీషియల్‌గా తన పార్టీ పేరును అనౌన్స్ చేశారు. అయితే పార్టీకి తాను నాయకత్వం వహించబోనని తెలిపారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి తన పార్టీ అధ్యక్షుడు అవుతారని చెప్పారు. 2025 జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జన్ సురాజ్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.

Read Also: Nagarjuna : కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున సీరియస్

ప్రశాంత్ కిశోర్ తన పార్టీ పేరును ప్రకటించిన అనంతరం.. ఆ పార్టీ మొదటి అధ్యక్షుడిగా మనోజ్ భారతి పేరును ప్రకటించారు. దళిత వర్గానికి చెందిన మనోజ్ భారతి మధుబని జిల్ల వాసి. చిన్నతనంలో జాముయి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మనోజ్.. అనంతరం ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. అనంతరం యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా నాలుగు దేశాల్లో పనిచేశారు! ఈ క్రమంలోనే ఆయనను జన్ సూరజ్ పార్టీ తొలి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రశాంత్ కిశోర్… మనోజ్ భారతి తనకంటే సమర్థులని కొనియాడారు.

బిహార్ ప్రజలు గత 30 ఏళ్లుగా ఆర్జేడీ, జేడీయూ లేదా బీజేపీ పార్టీలకు మాత్రమే ఓటు వేస్తున్నారని చెప్పారు. ఈ సంప్రదాయానికి ముగింపు పలికాలని, తమ పార్టీ రాజవంశానికి చెందినది కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే కేంద్రీయ ఎన్నికల సంఘం జన్ సూరాజ్ పార్టీలను గుర్తించినట్లు తెలిపారు. బిహార్ విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పు కోసం రూ. 5 లక్షల కోట్ల అవసరమని, విద్యారంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించేందుకు రాబోయే పదేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయాలని పీకే పేర్కొన్నారు.

కాగా, అక్టోబర్ 2 – 2022న ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పేరుతో ప్రారంభించిన యాత్ర రెండేళ్లు పూర్తి సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన అక్టోబరు 2న కొత్త పార్టీ గురించి వెళ్లడిస్తానని తెలిపారు. అనట్లుగానే ఈ రోజు బీహార్ రాజధాని పాట్నాలో తన కొత్త పార్టీ పేరును వెల్లడించారు.

Read Also: AP Cabinet : ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ..పలు అంశాలపై చర్చ..!