Note for Vote Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

Supreme Court: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) ఓటుకు నోటు వ్యవహారంపై(Note for Vote Case) సీబీఐ విచారణ(CBI investigation) చేపట్టాలన్న పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం తెలిపింది. జూలై 24న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని.. ఆ వివరాలను అందించేందుకు తెలంగాణ […]

Published By: HashtagU Telugu Desk
Supreme Court

Supreme Court

Supreme Court: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) ఓటుకు నోటు వ్యవహారంపై(Note for Vote Case) సీబీఐ విచారణ(CBI investigation) చేపట్టాలన్న పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం తెలిపింది. జూలై 24న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని.. ఆ వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగటానికి అవకాశం లేదు కాబట్టి సెలవులు అనంతరం తీసుకోవాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర కోర్టును కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాక జూలై చివరి వారంలో విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరు ఏఏ అంశాలపై లిఖితపూర్వకంగా ఇవ్వాలనుకుంటున్నారో వాటన్నింటిని అందించాలని, జూలై 24 తరువాత వాయిదాలు కోరవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 24కి వాదాయి వేసింది.

Read Also: Naxalites Vs Polling Station : ఏకంగా పోలింగ్​ బూత్​లోకి వెళ్లి మావోయిస్టుల వార్నింగ్ !

కాగా, 2015లో జరిగిన విషయం ఇది.. ఏళ్ల తరబడి కేసు పెండింగ్‌లో ఉంటు వస్తుంది. ప్రతిసారి ఏదో ఒక సాకుతో కేసు విచారణ పడుతూ వస్తోంది. విచారణను త్వరితగతిన చేపట్టాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది బసంత్ కోరారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు, చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. కేసుల విచారణలో వాయిదాలు కోరడం సహజం.. అదివేరే కేసుల్లో మీకుకూడా వర్తిస్తుందని బసంత్ కు జస్టిస్ ఎంఎం సుందరేష్ వివరించారు. ఇన్ని సంవత్సరాలు ఆగిన విచారణ రెండు వారాలతో ఏమీ మారిపోదు కాబట్టి.. వేసవి సెలవుల తర్వాత విచారణకు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.

 

 

 

 

 

 

  Last Updated: 18 Apr 2024, 02:52 PM IST