Population Vs Bomb Vs Gift : ఎక్కువ మంది పిల్లలుంటే తీరొక్క న్యాయం.. ప్రమోషన్, బోనస్, డిమోషన్, జైలు, వెట్టిచాకిరీ

Population Vs Bomb Vs Gift : సిక్కింలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రమోషన్, ఇంక్రిమెంట్.. జనాభాతో ముడిపడిన ఆసక్తికరమైన ప్రపంచ విషయాలపై ఒక లుక్ వేద్దాం..

  • Written By:
  • Updated On - July 2, 2023 / 07:53 AM IST

Population Vs Bomb Vs Gift : సిక్కింలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రమోషన్, ఇంక్రిమెంట్.. 

ఛత్తీస్ గఢ్ లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే జాబ్ నుంచి సస్పెండ్.. 

ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం మిజోరంలో .. మొత్తం 167 మంది

నైజర్‌లో ప్రతి స్త్రీకి సగటున ఏడుగురు పిల్లలు..  

ఉత్తర కొరియాలో ఎక్కువ మంది పిల్లలున్న వారితో వెట్టిచాకిరీ..

డెన్మార్క్‌లో ఎక్కువ మంది పిల్లలున్న పేరెంట్స్ కు బోనస్..   

జనాభాతో ముడిపడిన ఆసక్తికరమైన విషయాలపై ఒక లుక్ వేద్దాం..

ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రమోషన్, ఇంక్రిమెంట్

మన దేశంలోని సిక్కిం జనాభా పెరగడానికి బదులు తగ్గుతోంది. దీంతో ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఇస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న మహిళా ఉద్యోగులకు జీతం పెంపుతో సహా అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఈవిధంగా జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోని మొదటి రాష్ట్రం సిక్కిం. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న సాధారణ ప్రజలకు కూడా ప్రభుత్వం అనేక సౌకర్యాలను అందిస్తోంది.

ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు.. జాబ్ నుంచి సస్పెండ్

సిక్కింలో ఉన్నదానికి పూర్తిగా డిఫరెంట్ సీన్ ఛత్తీస్ గఢ్ లో ఉంది. ఛత్తీస్ గఢ్ లోని బలోద్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్ తన భార్యకు డెలివరీ కావటంతో 8 రోజులు సెలవు అడిగాడు. ఈక్రమంలో కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత అని ఆఫీసర్లు అడిగారు. “ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు  నాలుగో బిడ్డ రాబోతున్నాడు” అని చెప్పాడు. ఈ ఆన్సర్  విన్న వెంటనే ఆ కానిస్టేబుల్‌ ప్రహ్లాద్ సింగ్ ను సస్పెండ్ చేశారు. కొత్త జనాభా చట్టం ప్రకారం అతన్ని సస్పెండ్ చేశామని అధికారులు చెప్పారు. జాతీయ జనాభా విధానం, ఛత్తీస్‌గఢ్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తన 1965లోని రూల్ 3 (1) ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు.మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించి, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మన దేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పుడు కొత్త జనాభా విధానం ప్రకారం చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం.. మొత్తం 167 మంది 

ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం కూడా మన దేశంలోనే ఉంది. మిజోరంలోని ‘చానా’ కుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం. 2021 జూన్ లో ఈ కుటుంబ పెద్ద జియోనా చానా మరణించారు. జియోనాకు 39 మంది భార్యలు, చాలామంది కుమారులు, కుమార్తెలు, మనుమలు ఉన్నారు. ఈ కుటుంబంలో మొత్తం 167 మంది సభ్యులు ఉన్నారు.  మత సంప్రదాయాల ప్రకారం వీరంతా కలిసి జీవిస్తున్నారు.

Also read : West Indies: వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో వెస్టిండీస్ ఓటమికి ప్రధాన కారణాలివే..?

సగటున 7 మంది పిల్లలు 

ఆఫ్రికన్ దేశం నైజర్ లో సగటున ఒక స్త్రీకి 7 మంది పిల్లలు ఉన్నారు. చాద్, కాంగో, మాలి, సోమాలియా వంటి ఆఫ్రికా దేశాల్లో కూడా ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ సంతానోత్పత్తి రేటు ఉంది.

ఎక్కువ మంది పిల్లలుంటే వెట్టిచాకిరీ

జనాభాను నియంత్రించడానికి ఉన్న ఏ అవకాశాన్ని కూడా ఉత్తర కొరియా వదలడం లేదు. ఇక్కడ, పిల్లల పుట్టుకకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ  జరిమానాలు విధిస్తారు. బలవంతంగా అబార్షన్లు చేస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా వేస్తారు. ఎక్కువ మంది పిల్లలున్న వారితో ఎక్కువ పని.. వెట్టి చాకిరీ చేయిస్తారు. ఉత్తర కొరియా లో ప్రతి కుటుంబానికి గరిష్టంగా 5 మంది పిల్లలు ఉండొచ్చు.

Also read : Elon Musk: ట్విట్టర్ యూజర్లకు బిగ్ షాక్.. పరిమితులు విధిస్తూ మస్క్ షాకింగ్ ట్వీట్..!

ఎక్కువమంది పిల్లలు ఉంటే.. ఎక్కువ బేబీ బోనస్

యూరోపియన్ దేశం డెన్మార్క్ లో బిడ్డ పుట్టగానే ‘చైల్డ్ బర్త్ గ్రాంట్’ ఇస్తారు. దీన్ని ‘బేబీ బోనస్'(Population Vs Bomb Vs Gift) అంటారు. బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులకు ఒకసారి ఈ పేమెంట్ చెల్లిస్తారు. ఆ  కుటుంబానికి పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. సింగపూర్ జనాభాను పెంచేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది. ‘బేబీ బోనస్ స్కీమ్’ కింద బిడ్డ పుట్టినప్పుడు, కుటుంబానికి నగదు బహుమతి, పిల్లల పేరు మీద పొదుపు పథకం అందిస్తున్నారు. ప్రభుత్వ గృహ ప్రయోజనాలు, పన్ను మినహాయింపులు, ఆరోగ్యం మరియు విద్యలో రాయితీలను కూడా అందిస్తున్నారు. బిడ్డ పెద్దయ్యాక కూడా  ప్రభుత్వం అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. యూరోపియన్ దేశమైన హంగరీ కూడా జనాభా క్షీణతతో ఇబ్బందిపడుతోంది. ఇక్కడ జనాభాను పెంచడానికి రుణ రాయితీతో పాటు, పన్ను ప్రయోజనాలు, చికిత్సకు సంబంధించి అనేక రాయితీలు ఇస్తోంది.

జనాభాను పెంచడానికి 500+ ప్రోగ్రామ్

జనాభాను పెంచడానికి ప్రత్యేకమైన విధానాలను అమలు చేయడంలో పోలాండ్ కూడా ముందుంది. ఇక్కడ పిల్లలు పుట్టినప్పుడు ప్రతి నెలా ప్రయోజనాలు ఇస్తారు. ఈ రకమైన ప్రయోజన పథకానికి ప్రభుత్వం ‘ఫ్యామిలీ 500+ ప్రోగ్రామ్’ అనే పేరు పెట్టింది. దీని ద్వారా పిల్లల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది కాకుండా తల్లిదండ్రులకు పన్ను మినహాయింపు , పిల్లల సంరక్షణ రాయితీ కూడా ఇస్తారు.