Tirupati : నటుడు మంచు మనోజ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ వస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని నోటీసులో పేర్కొన్నారు. యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే యూనివర్సిటీలో మోహన్ బాబు, మంచు విష్ణు ఉన్నారు. దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు యూనివర్సిటీ గేటు వద్ద వేచి ఉన్నారు.
పోలీసులు నోటీసులను ధిక్కరించి మంచు మనోజ్.. కాలేజీ దగ్గరికి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మోహన్ బాబు కాలేజీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక అటు మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో.. మోహన్ బాబు కాలేజీ గేట్లను పూర్తిగా మూసివేసిన సిబ్బంది. మోహన్ బాబు కాలేజీ వద్దకు ఎవరిని అనుమతించని సెక్యూరిటీ సిబ్బంది..మోహన్ బాబు కాలేజీ గేట్లను పూర్తిగా మూసివేసింది.
ఇక, మంచు మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకుని, రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుమార్గంలో ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీకి బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు యూనివర్సిటీ పరిసరాల్లో ఎవ్వరినీ అనుమతించడం లేదు. గేట్లను కూడా మూసివేయడంతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గత కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు ఇంట్లో అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు ఏర్పడడం వల్లే, మనోజ్ గొడవ పడుతున్నారంటూ వార్తలు రాగా.. మరొకవైపు ఆస్తుల కోసమే గొడవ పడుతున్నారంటూ అందరూ అనుకున్నారు. ఏది ఏమైనా ఈ కుటుంబంలో గొడవలు అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. దీనికి తోడు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేసిన కేసులో ఏకంగా సుప్రీంకోర్టును బెయిల్ కోసం ఆశ్రయించగా.. విచారణ అనంతరం.. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు సుప్రీంకోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే.