Site icon HashtagU Telugu

Rajasthan : నేడు రాజస్థాన్‌లో రూ.26 వేల కోట్ల ప్రాజెక్ట్‌లకు ప్రధాని శంకుస్థాపన

PM Modi Warned Pakistan

PM Modi Warned Pakistan

Rajasthan : ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రాజస్థాన్ రాష్ట్రంలోని బీకనెర్ జిల్లా పర్యటనలో భాగంగా పలుప్రధాన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.26 వేల కోట్ల విలువైన రైల్వే, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. బీకనెర్ సమీపంలోని పలానా వద్ద ఈ కార్యక్రమం ఉదయం ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద దేశవ్యాప్తంగా పలు రీడెవలప్ చేసిన రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మొత్తం 18 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో అభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లు ఈ కార్యక్రమంలో ప్రారంభించబడ్డాయి. ఇదే స్కీమ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 1,300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు కూడా ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు.

Read Also: Pawan Kalyan: సినిమా థియేటర్‌లో లైవ్.. ప్రజలతో పవన్‌ వర్చువల్ ముఖాముఖి

తెలుగు రాష్ట్రాల్లో అధునీకరించిన రైల్వే స్టేషన్లలో ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లూరు పేట, తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్ స్టేషన్లు ప్రధానమంత్రిచేత ప్రారంభించబోతున్నారు. ఇంతటితోనే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లను కూడా వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో అస్సాంలోని హైబర్‌గావ్, బిహార్‌లోని పిర్పైంటి, ఛత్తీస్‌గఢ్‌లోని దొంగగర్, భానుప్రతాపూర్, భిలాయ్, గుజరాత్‌లోని మోర్బి, ఓఖా, మిథాపూర్, జామ్ వంతాలి, హర్యానాలోని మండి దబ్వాలి, హిమాచల్ ప్రదేశ్‌లోని బైజ్నాథ్ పప్రోలా, జార్ఖండ్‌లోని రాజమహల్, కర్ణాటకలోని మునీరాబాద్, బాగల్‌కోట్, గడగ్, ధార్వాడ్, కేరళలోని వడకర, చిరాయింకీజ్, మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్, కట్ని సౌత్, మహారాష్ట్రలోని పరేల్, వడాలా రోడ్, ముర్తిజాపూర్ జంక్షన్, పుదుచ్చేరిలోని మహే, రాజస్థాన్‌లోని ఫతేపూర్ షెఖావతి, బుండి, తమిళనాడు లోని తిరువణ్ణామలై, మన్నార్గుడి, ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్, సహరాన్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని పనగఢ్ వంటి అనేక స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రైల్వే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా, ఈ కార్యక్రమం ప్రాంతీయ అభివృద్ధికి బలాన్ని చేకూర్చుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నేతృత్వంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు ఈ ప్రాజెక్టులు స్పష్టం చేస్తున్నాయి.

Read Also: Donald Trump Jr: రిపబ్లికన్ పార్టీ పిలుస్తోంది.. నేనూ అధ్యక్షుడిని అవుతా : ట్రంప్ కుమారుడు

 

 

 

 

Exit mobile version