Site icon HashtagU Telugu

PM Modi : ‘గర్బా’ నృత్యంపై పాట రాసిన ప్రధాని మోడీ

PM Modi Pens Down Garba Song For Goddess Durga And Navratri Festivities

PM Modi Pens Down Garba Song For Goddess Durga And Navratri Festivities

PM Modi Penned Garbha Song: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దుర్గామాత ఉపాస‌కుడు. శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఆయ‌న ఆ అమ్మ‌వారిని ఆరాధిస్తూ ప్ర‌త్యేకంగా ఓ గ‌ర్భా గీతాన్ని రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి ఆలపించారు. నేడు ప్రధాని తన ఎక్స్‌ ఖాతాలో ఆ పాట వీడియోను షేర్‌ చేశారు. ”ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా వివిధ రకాలుగా ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ అవటికలయ అనే గర్బా పాటను నేను రచించాను. మనందరిపైనా ఆమె కృప ఉండాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. ఈసందర్భంగా వర్ధమాన గాయని పూర్వా మంత్రి తన అద్భుతమైన స్వరంతో దీనిని ఆలపించారని ప్రధాని మరో పోస్టులో ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

Read Also: Akkineni Nagarjuna : నేడు నాంపల్లి కోర్టులో నాగార్జున పిటిషన్ పై విచారణ

గతేడాది కూడా ప్రధాని శరన్నవరాత్రుల వేళ గర్బాపై ప్రత్యేకమైన కవితను రాశారు. అది మ్యూజిక్‌ వీడియో రూపంలో నాడు విడుదలైంది. చాలాఏళ్ల కిత్రం దీన్ని రాశానని.. ఇప్పుడు ఈ గీతాన్ని వింటుంటే పాత స్మృతులు గుర్తుకువస్తున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. గర్బాపై మరో పాటను కూడా తాను రాశానని తెలిపారు. ”చాలా ఏళ్ల నుంచి రాయలేదు. కానీ గత కొన్ని రోజుల్లో గర్బాపై కొత్త పాటను రాయగలిగాను. నవరాత్రి సందర్భంగా అందరితో ఆ పాటను పంచుకుంటాను” అని నాడు ఆయన చేసిన ఎక్స్ పోస్టులో వెల్లడించారు. ఆ పాటకు గాయని ధ్వని భానుశాలి గాత్రాన్ని ఇవ్వగా, స్వరాలను బాలీవుడ్‌ సంగీత దర్శకుడు తనిష్క్‌ బాగ్చి సమకూర్చారు. జేజస్ట్‌ మ్యూజిక్‌ సంస్థ ఆ పాటను చిత్రీకరించింది.

Read Also: Rashmika Mandanna : రష్మిక తొలి ఆడిషన్ వీడియో చూశారా..?