PM Modi: కాశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు రాళ్లు కాదు.. బుక్స్, పెన్స్: ప్రధాని మోడీ

PM Modi in Srinagar election campaign: కాశ్మీర్ లో 50వేల మంది డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి స్కూళ్లకు రప్పించాం అని అన్నారు. కాశ్మీర్ ను దోచుకోవడం తమ జన్మహక్కు అన్నట్టు ఆ మూడు కుటుంబాలు ప్రవర్తించాయి. కాశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు రాళ్లు కాదు.. బుక్స్, పెన్సు కనిపిస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
PM Modi in Srinagar election campaign

PM Modi in Srinagar election campaign

PM Modi in Srinagar election campaign: ప్రధాని మోడీ నేడు శ్రీనగర్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అనంతర ఆయన మాట్లాడుతూ..కాశ్మీర్ లో 50వేల మంది డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి స్కూళ్లకు రప్పించాం అని అన్నారు. ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్రాన్ని లూటీ చేసిన‌ట్లు ఆరోపించారు. కాశ్మీర్ ను దోచుకోవడం తమ జన్మహక్కు అన్నట్టు ఆ మూడు కుటుంబాలు ప్రవర్తించాయి. కాశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు రాళ్లు కాదు.. బుక్స్, పెన్సు కనిపిస్తున్నాయి. కాశ్మీర్ లో ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిమ్స్, ఐఐటి వంటి వార్తలు ఇప్పుడు కాశ్మీర్ లో వినిపిస్తున్నాయి. గతంలో లాల్ చౌక్ దగ్గర ఉగ్రదాడులు జరిగేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ఆ మూడు పార్టీలు విద్యార్థుల చేతికి రాళ్లు ఇచ్చేవి..

స్కూళ్లను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటే.. వారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ మూడు పార్టీలు విద్యార్థుల చేతికి రాళ్లు ఇచ్చేవి.. అన్నారు. జ‌మ్మూక‌శ్మీర్ యువ‌త న‌లిగిపోయిన‌ట్లు పేర్కొన్నారు. ఉగ్ర‌వాద ఛాయ‌లు లేకుండా తొలి సారి జ‌మ్మూక‌శ్మీర్‌లో స్వేచ్ఛ‌గా ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ట్లు మోడీ తెలిపారు. భార‌త ప్ర‌జాస్వామ్యాన్ని జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌లు బ‌లోపేతం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. అధిక సంఖ్య‌లో ఓట‌ర్లు పోలింగ్‌లో పాల్గొని చ‌రిత్ర సృష్టించార‌న్నారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో అధిక సంఖ్య‌లో ఓటింగ్ జ‌ర‌గ‌డం ప‌ట్ల గ‌ర్వంగా ఫీల‌వుతున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.

ప్రజలు ఎన్నికలపట్ల ఉత్సాహంగా ఉన్నారు..

పర్యటనకు ముందు ప్రధాని ఎక్స్‌ వేదిక మాట్లాడుతూ..‘నేను ఈరోజు జమ్మూకాశ్మీర్‌ ప్రజల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను. ఈరోజు శ్రీనగర్‌, కత్రా ఎన్నికల ర్యాలీలో పాల్గొంటాను. జమ్మూకాశ్మీర్‌ ప్రజలు ఎన్నికలపట్ల ఉత్సాహంగా ఉన్నారని నిన్న పోలింగ్‌తో తేలింది. నేను ర్యాలీలో అభివృద్ధి ఎజెండా గురించి మాట్లాడతాను. ప్రజల ఆశీస్సులు తీసుకుంటాను’ అని మోడీ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

కాగా, జమ్మూ కశ్మీర్‌లో రెండో దశలో 47 స్థానాల్లో ఓటింగ్‌ జరగనుంది. బీజేపీ 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపింది. ఇది మొత్తంలో మూడింట ఒక వంతు కంటే తక్కువ. 2014 అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ కావడం గమనార్హం. బీజేపీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నంలో భాగంగా మోడీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. మొదటి దశ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా మోడీ దోడాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండో దశ పోలింగ్‌లో భాగంగా నేడు శ్రీనగర్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

Read Also:Nursing Student Suicide : యువతి మృతికేసులో వీడిన మిస్టరీ

  Last Updated: 19 Sep 2024, 01:33 PM IST