Site icon HashtagU Telugu

Modi Award : ప్రధాని మోడీకి 2 దేశాల అత్యున్నత పురస్కారాలు

Modi Award

Modi Award

ప్రధాని మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ఫిజీ, పపువా న్యూ గినియా దేశాలు అత్యున్నత పురస్కారాలను (Modi Award)  ప్రకటించాయి. పాపువా న్యూ గినియా పర్యటనలో ఉన్న మోడీకి సోమవారం ఫిజీ అత్యున్నత పురస్కారాలను అందజేశాయి. ” ఫిజీ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ” గౌరవాన్ని ఫిజీ ప్రధాని సితివేణి రబుకా .. మోడీకి ప్రదానం చేశారు. ప్రధాని మోడీ ప్రపంచ నాయకత్వాన్ని గుర్తించి ఈ అవార్డును బహూకరించారు. ఇక పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతకు, “గ్లోబల్ సౌత్ దేశాల” అభివృద్ధికి నాయకత్వం వహించినందుకు గానూ ప్రధాని మోడీకి పాపువా న్యూ గినియా దేశం అత్యున్నత పురస్కారం లోగోహు ను ప్రదానం చేసింది.

also read : Ukraine Russia War: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం

ఫిజీ దేశం అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోడీకి (Modi Award) అందించిన వెంటనే.. పాపువా న్యూగినియా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. అంతకుముందు సోమవారం ఉదయం పాపువా న్యూ గినియాలో ప్రధాని మోడీ టోక్ పిసిన్ భాషలో తమిళ క్లాసిక్ ‘తిరుక్కురల్‌’ను విడుదల చేశారు.  ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐల్యాండ్స్ కార్పొరేషన్ (FIPIC) మూడో సదస్సు సందర్భంగా మోడీకి ఈ రెండు దేశాలు పురస్కారాలను అందజేశాయి. కాగా, జీ7 దేశాల సదస్సులో ఆదివారం  ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “గ్లోబల్ సౌత్ దేశాల”కు ఐక్యరాజ్య సమితిలో సముచిత స్థానం కల్పించాలని  డిమాండ్ చేశారు.