PM Modi : తెలంగాణను నాశనం చేసేందుకు హస్తం పార్టీకి ఈ ఐదేళ్లు చాలు: ప్రధాని మోడీ

  PM Modi Speech in Nagarkurnool Public Meeting : తెలంగాణ(telangana)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారం(campaign)లో భాగంగా ఈరోజు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాని పర్యటిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలో ఏర్పాటు చేసే బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని, కమలం పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా మోడీ బహిరంగ సభ(BJP Vijaya Sankalpa Sabha) కొనసాగుతుంది. మూడోసారి బీజేపీ గెలవాలని తెలంగాణ […]

Published By: HashtagU Telugu Desk
Pm Modi Addresses A Public

Pm Modi Addresses A Public

 

PM Modi Speech in Nagarkurnool Public Meeting : తెలంగాణ(telangana)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారం(campaign)లో భాగంగా ఈరోజు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాని పర్యటిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలో ఏర్పాటు చేసే బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని, కమలం పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా మోడీ బహిరంగ సభ(BJP Vijaya Sankalpa Sabha) కొనసాగుతుంది. మూడోసారి బీజేపీ గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో కమలం వికసించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్​ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారని చెప్పారు. పదేళ్లుగా బీఆర్ఎస్​, కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజల కలలను చిదిమేశాయని దుయ్యబట్టారు. ఇన్నేళ్లు బీఆర్ఎస్​ అవినీతికి పాల్పడితే ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్‌ భావిస్తోందన్నారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ఆరోపించారు. తెలంగాణను నాశనం చేసేందుకు హస్తం పార్టీకి ఈ ఐదేళ్లు చాలు అని ప్రధాని విమర్శించారు.

read also: YCP Candidates List : జిల్లాల వారీగా వైసీపీ అభ్యర్థుల లిస్ట్..

కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్ ఖాయం. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారు. బీజేపీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారంటూ మోడీ అన్నారు. ఎన్డీయే కూటమి ఈసారి 400 లోక్ సభ స్థానాలను గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే గాలివీస్తోందని ప్రధాని మోడీ అన్నారు.

 

  Last Updated: 16 Mar 2024, 02:20 PM IST