Site icon HashtagU Telugu

Plane crash : అమెరికాలో మళ్లీ ఢీకొన్న విమానాలు.. ఇద్దరు మృతి

Planes collide again in America.. Two killed

Planes collide again in America.. Two killed

Plane crash : మరోసారి అమెరికాలో విమాన ప్రమాదం సంభవించింది. ఆరిజోనా రాష్ట్రంలోని మరానా రీజినల్‌ ఎయిర్‌పోర్టులో రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్టు యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రమాదంతో మంటలు చెలరేగి భారీగా పొగలు వచ్చాయి. ఇటీవల ఒక విమానం ఒక హెలికాప్టర్​ ఢీకొన్న ఘటనలో 67 మంది మరణించిన కొన్ని వారాల వ్యవధిలోనే తాజా ఘటన జరగడం ఆందోళనకు గురిచేస్తోంది.

Read Also: OTT Platforms : ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు

కాగా, అరిజోనా రాష్ట్రంలోని టక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వాయవ్యంగా 30 మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ మేరకు ఎఫ్ఏఏ తన అధికారిక వెబ్​సైట్​లో వివరాలను వెల్లడించింది. అయితే గాల్లో ఢీకొన్న అనంతరం ఒక విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా, మరో విమానం రన్​వే సమీపంలో భూమి మీద క్రాష్​ అయ్యింది. ఆ వెంటనే ఆ విమానంలో మంటలు చెలరేగాయి.

ప్రమాదానికి గురైన రెండు విమానాలను అమెరికా నేషనల్ ట్రాన్స్​పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (ఎన్​టీఎస్​బీ) గుర్తించింది. అవి లాన్ షైర్ 360 ఎంకే 2 విమానం, సెస్నా 172 ఎస్ ఎయిర్​క్రాఫ్ట్​. సెస్నా సురక్షితంగా ల్యాండ్ అయిందని, లాన్​షైర్ కిందపడటంతో మంటలు చెలరేగాయని తెలిపింది. విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు మరానా పోలీస్ డిపార్ట్​మెంట్ ధృవీకరించింది.

Read Also: NTR – Neel : ఎన్టీఆర్ – నీల్ సినిమా షూట్ మొదలయింది.. షూటింగ్ ఫోటో షేర్ చేసి..