సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల కాలంలో ఏంచేసినా అది వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం దగ్గరి నుండి ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకారం వరకు..ప్రతిదీ ట్రేండింగ్ లో నిలుస్తుంది. ఇది కావాలని చేసేది కూడా కాదు..ఆలా జరిగిపోతుందంతే. కొంతమంది పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు..కానీ అంత ఖర్చు పెట్టిన దాని గురించి మాట్లాడేవారు ఉండరు..కనీసం చూసేవారు కూడా ఉండరు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఆలా కాదు..ఆయన చేతితో జుట్టును ఆలా అన్నాసరే వైరల్ అవుతుంటుంది. అలాంటిది తన పదేళ్ల కోరిక తీరితే ఇక అభిమానులు ఊరుకుంటారా…తమ గెలుపుకన్నా ఎక్కువ వైరల్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు కృష్ణా జిల్లా కేసరపల్లిలో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జరిగింది. సీఎంగా చంద్రబాబు తో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ ప్రమాణ స్వీకర కార్యక్రమానికి దేశ ప్రధాని, కేంద్ర మంత్రులు, చిరంజీవి, రజినీకాంత్ సహా అత్యంత ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం మొత్తంలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం వీడియో..ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ..చిరంజీవి చేతులను పట్టుకొని నిల్చువడం..అలాగే పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి పాదాభివందనం చేసిన ఘటన ఈ మూడు వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియా లో టాప్ ట్రేండింగ్ లో కొనసాగుతున్నాయి. ఎవరు చూడు ఈ వీడియోస్ నే చూస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఆ వీడియోలకు బ్యాక్ గ్రౌండ్ పలు సాంగ్స్ జోడించి తమ టాలెంట్ ను చూపిస్తూ..వారి అభిమానాన్ని కనపరుస్తున్నారు. అంత చంద్రబాబు ..లోకేష్ ప్రమాణ స్వీకారాలు వైరల్ అవుతాయని అనుకున్నారు కానీ పవన్ మొత్తం తన వైపు తిప్పేసుకున్నాడు.
మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే వేదికపై ఉన్న మోడీ, సీఎం చంద్రబాబు , రజనీకాంత్ , చిరంజీవి సహా ఇతర పెద్దలకు నమస్కరిస్తూ వెళ్లిన పవన్ తిరిగి వస్తూ.. తన అన్నయ్య వద్ద ఆగి ఆయన పాదాలపై పడ్డారు. కింద ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న చిరంజీవి సతీమణి సురేఖ, ఆయన తనయుడు రాంచరణ్ ఈ దృశ్యం చూసి భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ దగ్గరకి వెళ్లిన పవన్ కళ్యాణ్ .. చిరంజీవి వైపు చూపెడుతూ చెవిలో ఏదో చెప్పారు. తర్వాత మోడీని తీసుకుని తన అన్నయ్య వద్దకు వెళ్లి పరిచయం చేశారు. అనంతరం మోడీ.. చిరు, పవన్‌ల చేతులు పట్టుకుని మరీ వేదిక మధ్యలోకి తీసుకొచ్చారు. తర్వాత ముగ్గురూ చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం మెగా బ్రదర్స్ ఇద్దరినీ దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో చిరంజీవి ఉద్వేగానికి గురయ్యారు. పవన్ బుగ్గలు నిమురుతూ ఆప్యాయత చూపారు. వేదిక కింద నుంచి తన తండ్రి, బాబాయ్‌లను మోడీ పక్కన చూసి రామ్‌చరణ్ సైతం ఎమోషనల్ అయ్యారు. ఇలా ఈ వీడియోస్ అన్ని ఇప్పుడు వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
Read Also :