Rajnath Singh : జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపుర్‌లో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యోగాసనాలు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఇంకా మద్దతిస్తూ ఉంటే అది తమ భవిష్యత్తును స్వయంగా బలిపశువు చేసుకుంటోందని ఘాటు హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ తరఫున ఉగ్రవాదానికి మద్దతు కొనసాగితే అది అత్యంత దారుణ పరిణామాలకు దారితీస్తుంది. దేశ భద్రత కోసం అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకోవడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం అని మంత్రి తెలిపారు.
Read Also: International Yoga Day : రాత్రి భోజనం తర్వాత యోగా చేయవచ్చా..?
ఆపరేషన్ సిందూర్, 2016లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ మరియు 2019లో బాలాకోట్ వైమానిక దాడులకు సహజమైన కొనసాగింపుగా అభివర్ణించారు. ఇది భారత్ హజార్ కట్ పాలసీ తో సంబంధం కలిగి ఉందని, ఆ విధానంతో పాకిస్థాన్‌కు గట్టి సందేశం అందిందన్నారు. ఈ ఆపరేషన్ పునాది జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులపై జరిగిన దుర్మార్గపు కృత్యానికి ప్రతీకారం తీసుకోవడమే. దాడిలో బాధితుల సంఖ్య పెరగడం దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకతను కలిగించింది. ఈ నేపథ్యంలోనే భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై అత్యంత ఖచ్చితంగా ఉగ్రదళాలు దాడులు నిర్వహించాయి. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా కొనసాగిన తర్వాత పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడికి లోనై, కాల్పుల విరమణకు సిద్ధమైందని అధికారులు చెబుతున్నారు.
పాక్ ప్రభుత్వం మౌనంగా తలదించుకోవడమే దీనికి నిదర్శనం. భారత్ లక్ష్యం ఉగ్రవాద స్థావరాలను నిర్వీర్యం చేయడమేనని, ఆ దిశగా తీసుకున్న చర్యలు పాజిటివ్ ఫలితాలను ఇస్తున్నాయని రక్షణ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేశ భద్రతపై ఒక అడుగు కూడా వెనక్కి వేయం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి భారత్‌కు ఉంది. మేము శాంతిని కోరుకుంటాం, కానీ శాంతికి అడ్డంగా ఉండే వారిని ఉపేక్షించం అని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. యోగా వంటి శాంతిమార్గాల విలువను ప్రపంచానికి తెలియజేస్తూనే దేశ శత్రువులకు గట్టి సందేశాలు పంపడం కూడా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Yogandhra 2025 : ప్రధానికి గిన్నిస్ రికార్డు కానుక ఇవ్వాలనే యోగాంధ్ర నిర్వహించాం: లోకేశ్