PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం బిహార్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా దేశం ఎలా కఠినంగా స్పందించిందో వివరిస్తూ గత హామీని గుర్తుచేశారు. ఒక్కసారి వాగ్దానం చేస్తే, దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గం. ఇదే కొత్త భారత్ ధోరణి అని ప్రధాని స్పష్టం చేశారు. బిహార్‌లోని కరకట్ లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పహల్గాం దాడి తర్వాత 2019లో బిహార్‌కు వచ్చిన తన పూర్వ పర్యటనను గుర్తు చేశారు. ఆ సమయంలోనే పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తానని దేశ ప్రజలకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాకే తిరిగి ఈ గడ్డపై అడుగుపెట్టాను అని చెప్పారు.
Read Also: PF Withdrawal : ఇకపై సెకన్ల లలో పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు..ఎలా అంటే !!
పాక్ ఉగ్రవాదులు ఆ దేశ ఆర్మీ నీడలో సురక్షితంగా ఉన్నామనుకున్నారు. కానీ మన సైన్యం వారి ఎయిర్‌బేస్‌లు, మిలిటరీ స్థావరాలను నిమిషాల్లోనే ధ్వంసం చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ‘ఆపరేషన్ సిందూర్’ మన అమ్ములపొదిలో ఉన్న ఒక్క బాణం మాత్రమే. ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదు. మరోసారి దాడికి ప్రయత్నిస్తే.. ఈసారి ఆ పాము తలే నశించుతుంది అని ఆయన హెచ్చరించారు. పాక్ మన మహిళల సిందూర శక్తిని చిన్నచూపు చూశారు. కానీ ఇప్పుడు వారు దీని గొప్పతనాన్ని తెలుసుకున్నారు. దేశ ప్రజల రక్తానికి మనం విలువ ఉంది. అమాయకుల మరణాన్ని మర్చిపోలేం. కాబట్టే, ఉగ్రవాదానికి తీర్పు చెప్పాం అని మోడీ ఉత్సాహభరితంగా తెలిపారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని బిహార్ పర్యటిస్తున్నారు. పట్నాలో జరిగిన మరో సభలో ఆయన మాట్లాడుతూ..దేశ అభివృద్ధి ప్రయాణం వెనక్కి తగ్గదు. బిహార్‌లో అభివృద్ధి ఆగదు. ఇది నూతన భారత్ ఉజ్వల దిశ అని పేర్కొన్నారు. ఈ ఏడాది బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అభివృద్ధి, భద్రత, జాతీయత వంటి అంశాలపై కేంద్రం కొనసాగిస్తున్న విధానాలు బీజేపీ ప్రచారంలో ప్రధానంగా నిలిచే అవకాశం ఉంది.
Read Also: Odisha : ప్రభుత్వాధికారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కలకలం..