Pahalgam Attack : పహల్గామ్ దాడిలో పాకిస్థాన్ పాత్ర ఉందనేందుకు మరొక ఆధారం లభించిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసా పాక్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అతడు కరుడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. పాక్‌కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లు వెల్లడించాయి. ఆ సంస్థ మాస్టర్ మైండ్లే అతడిని కశ్మీర్‌కు పంపినట్లు పేర్కొన్నాయి. ఉగ్రదాడి దర్యాఫ్తులో భాగంగా అధికారులు కశ్మీర్ లో వందలాదిమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసాకు పాక్ సైన్యంతో సంబంధం ఉందని తేలింది.
Read Also: Pawan Kalyan : పాక్‌కు అనుకూలంగా మాట్లాడితే ఆ దేశానికే వెళ్లిపోవాలి : పవన్ కల్యాణ్
వీరిలో 15 మంది ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని ధ్రువీకరించారని అధికారులు వెల్లడించారు. అతడు పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరేలోకి సహాయకారిగా వచ్చినట్లు తెలుస్తోంది అని దర్యాప్తు బృందానికి చెందిన ఓ అధికారి పత్రికలకు వెల్లడించారు. ఈనేపథ్యంలో ఉగ్రవాదులకు, పాక్ సైన్యానికి మధ్య ఉన్న సంబంధాలను ఇది తెలియజేస్తోందన్నారు. ఇక, పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి హషీమ్ మూసా లష్కరేలోకి సహాయకుడిగా వచ్చినట్లు తెలుస్తోందని ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. ఉగ్రవాదులకు, పాక్ సైన్యానికి మధ్య ఉన్న సంబంధానికి ఇదే నిదర్శనమని చెప్పారు. పారా కమాండోలకు పాకిస్థాన్ అత్యాధునిక శిక్షణ ఇస్తోందని, కోవర్ట్ ఆపరేషన్లలో తీర్చిదిద్దుతోందని ఆరోపించారు. అత్యాధునిక ఆయుధాల వినియోగంపై శిక్షణ అందిస్తోందని తెలిపారు.
కాగా, పాక్ పారా కమాండోలు అత్యాధునిక శిక్షణ పొందుతున్నారు. వీరు అత్యాధునిక ఆయుధాల వినియోగంలోను, నేరుగా చేతులతో పోరాడటంలోను నిపుణులు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో కొందరు గతంలో గగన్‌నగర్, గదర్‌బాల్ అడవుల్లో ఆరుగురు స్థానికేతరులు, ఒక డాక్టర్‌ను, ఇద్దరు సైనిక పోర్టర్లను హత్య చేసిన ఘటనల్లో పాల్గొన్నారు. మూసా మాత్రం ఈ మూడు దాడుల్లోను పాల్గొన్నాడు. ఇక జునైద్‌భట్, అర్బాజ్ మిర్ కూడా పాక్‌లో శిక్షణ పొందినట్లు గుర్తించారు. వీరు సంప్రదాయేతర యుద్ధతంత్రం, కోవర్ట్ ఆపరేషన్లలో దిట్టలు. శిక్షణలో వీరిని మానసికంగా.. శారీరకంగా బలోపేతం చేస్తారు. దీంతోపాటు యుద్ధరంగంలో ఎత్తుగడలు కూడా నేర్పిస్తారు.