Site icon HashtagU Telugu

Lottery Jackpot: తల్లి చెప్పిన సలహాతో రాత్రికి రాత్రి కోటీశ్వరురాలైన కూతురు.. ఎలా అంటే?

North Carolina Woman

North Carolina Woman

సాధారణంగా పెద్దల మాట చద్ది మూట అని అంటుంటారు. దాని అర్థం పెద్దలు ఎప్పుడూ మన మంచి కోరి మంచి విషయాలను చెబుతూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు బయట ఎవరైనా పెద్దవారు కావచ్చు అనుభవం కొద్దీ వారు చెప్పే మాటలను చాలామంది లైట్ గా తీసుకోవడంతో పాటు వారి మాటలను వ్యతిరేకిస్తూ ఎదురు సమాధానాలు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక యువతి మాత్రం తన తల్లి మాట విని ఏకంగా రాత్రికి రాత్రి కోటీశ్వరు రాలు అయిపోయింది. దాంతో ఆ యువతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే..అమ్మ చెప్పిన సలహాను పాటించిన రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది. లాటరీలో రూ.2 కోట్లు తగిలడంతో ఆనందంలో తేలిపోయింది. అంతడబ్బు తన వద్ద ఉంటుందని కలలో కూడా ఉహించలేదని ఆ మహిళ సంబరపడిపోతోంది. అమెరికాలోని నార్త్ కరోలినాలో నివాసముండే 55 ఏళ్ల గినా డిల్లార్డ్‌ అనే మహిళను తాజాగా అదృష్టం వరించింది. గినా డిల్లార్డ్‌ తన తల్లితో కలిసి గ్రాసరీ షాపుకు వెళ్ళింది. అక్కడ సరదాగా ఫాస్ట్ ప్లే గేమ్ ఆడమని గినా డిల్లార్డ్‌ కు ఆమె తల్లి సూచించిందట. గినా డిల్లార్డ్‌ కూడా అంతకుముందు ఎప్పుడూ ఆ గేమ్ ని ఆడలేదట.

కానీ తన తల్లి చెప్పింది కదా అని సరదాగా ఐదు డాలర్లు పెట్టి టికెట్లు కొనుగోలు చేసి అడగా ఆమెకు అదృష్టవశాత్తు 2,54,926 డాలర్లు జాక్పాట్ కొట్టింది. అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాని విలువ రెండు కోట్లకు పై మాటే అని చెప్పవచ్చు. అయితే అంత పెద్ద మొత్తంలో లాటరీ గెలిచిన తర్వాత గినా డిల్లార్డ్‌ సంతోషంలో మాట్లాడుతూ తాను లాటరీ గెలుస్తానని అనుకోలేదని, అ క్రెడిట్ అంతా తన తల్లిదే అని తన తల్లి చెప్పడం వల్ల ఇలా జరిగింది అని ఆమె తెలిపింది. గెలిచిన డబ్బుతో ఆమె హోమ్ లోన్, కారు లోన్ కట్టేస్తానని, మిగతా మొత్తాన్ని దాచుకుంటానని తెలిపింది.

Exit mobile version