Breakup Controversy: బ్రేకప్ కు నో.. సిగరెట్లతో ప్రియుడి ఒళ్లంతా కాల్చిన ప్రియురాలు!

సాధారణంగా ప్రేమ విఫలమైతే అబ్బాయి అమ్మాయిపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేస్తుంటాడు. కానీ

Published By: HashtagU Telugu Desk
Woman crime

Woman crime

ఈతరం యువత (Youth) ప్రేమ పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ విఫలమైతే హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా ప్రేమ విఫలమైతే అబ్బాయి అమ్మాయిపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేస్తుంటాడు. కానీ ఇక్కడ ఓ అమ్మాయి… బ్రేకప్ కు ఒప్పుకోలేదని తన మొదటి ప్రియుడ్ని ఘోరంగా చితకబాదింది. ఈ ఘటన కేరళ (Kerala)లో చోటుచేసుకుది.

ఎర్నాకులంలోని వర్కాల సమీపంలో అయిరూర్ కు చెందిన తన మొదటి లవర్ ను చెరున్నియూర్ కు చెందిన లక్ష్మీ ప్రియ అనే యువతి అతడి ఇంటి నుంచే కిడ్నాప్ చేయించింది. లక్ష్మీ ప్రియ ప్రస్తుతం బీసీఏ చదువుతోంది. లక్ష్మీప్రియ యువకుడు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఆమె ఇటీవల ఎర్నాకులం కళాశాలలో చేరింది. అక్కడ ఆమెకు ఇంకో యువకుడు పరిచయమయ్యాడు. దీంతో తన మొదటి లవర్ ను వదిలించుకోవాలనుకుంది.

అతడికి బ్రేకప్ (Breakup) చెప్పింది. దీనికి అతడు అంగీకరించలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన లక్ష్మీప్రియ అతడిని కిడ్నాప్ చేయించి దాడి చేసింది. ఒళ్లంతా సిగరెట్లతో కాల్చింది. ఆ పైన నగ్నంగా రోడ్డుపై పడేసింది. లక్ష్మీ ప్రియతో పాటు ఆమె ఆరుగురు స్నేహితులు యువకుడి పై దాడికి దిగి అతడిని చిత్రహింసలు పెట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఆమె రెండో లవర్ కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం పదిమందిని పోలీసులు (Police Case) అరెస్టు చేశారు. ఇప్పటికే లక్ష్మీప్రియ రెండో ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త కేరళలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read:Megastar Tweet: డియర్ నాని ‘దసరా’ సినిమా చాలా బాగుంది!

  Last Updated: 13 Apr 2023, 05:15 PM IST