Site icon HashtagU Telugu

Nithyananda Assets : నిత్యానంద వేల కోట్ల ఆస్తులు ఆమెకేనా?

Nithyananda Assets

Nithyananda Assets

ఆధ్యాత్మిక గురువు నిత్యానంద (Nithyananda ) జీవసమాధి చెందినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ (Sundareswaran) ప్రకటించిన తర్వాత ఆయన ఆస్తుల (Nithyananda Assets) పై తీవ్ర చర్చలు మొదలయ్యాయి. నిత్యానందకు ప్రపంచవ్యాప్తంగా అనేక ఆశ్రమాలు, సముద్ర ద్వీపమైన ‘కైలాస’ అనే ప్రదేశం, అలాగే భారతదేశంలోని తిరువణ్ణామలై, బిడది, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో విలువైన భూములు ఉన్నాయి. ఈ ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ. 4,000 కోట్లు ఉంటుందని అంచనా.

Birdflu : ఏపీలో బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి

ఇప్పుడీ ఆస్తులన్ని ఎవరికీ చెందుతాయి అనేదానిపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. నిత్యానంద శిష్యుల ప్రకారం.. ఆయన సమాధి అనంతరం ఈ ఆస్తులన్నీ నటి రంజిత ఆధీనంలోకి వెళ్తాయని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా నిత్యానంద ఆశ్రమ కార్యకలాపాల్లో ఆమె కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. నిత్యానంద మతపరమైన కార్యకలాపాలు, ఆధ్యాత్మిక కేంద్రాల నిర్వహణలో రంజిత కీలక భూమిక పోషించిందని అనుచరులు చెబుతున్నారు. దీంతో ఈ ఆస్తుల నిర్వహణ బాధ్యత ఆమెకు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Peddi : రామ్ చరణ్ పెద్ది ఆడియో రైట్స్ భారీ ధరకు.. పుష్ప 2 ని మించి..?

ఇక నిత్యానంద ఆస్తుల భద్రత, నిర్వహణపై మరిన్ని చట్టపరమైన వివాదాలు తలెత్తే అవకాశముంది. నిత్యానంద గతంలో వివాదాలకు కారణమైన నేపథ్యంలో ఆయన ఆస్తుల గురించి అనేక మతపరమైన, ప్రభుత్వ అధికారిక స్థాయిలో విచారణలు జరిగే అవకాశం ఉంది. నిత్యానంద ఆశ్రమానికి అనుబంధంగా ఉన్న శిష్యులు, న్యాయ నిపుణులు దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. రంజిత వాస్తవంగా ఈ ఆస్తులపై హక్కు కలిగి ఉన్నారో లేదో అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే ఈ అంశంపై అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశముంది.