Plot To Kill Pm Modi : ప్రధాని హత్యకు పీఎఫ్ఐ కుట్ర కేసు..16 చోట్ల ఎన్‌ఐఏ రైడ్స్

Plot To Kill Pm Modi : కర్ణాటకలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) రైడ్స్ నిర్వహిస్తోంది.దక్షిణ కన్నడ జిల్లాలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి సంబంధించిన 16 చోట్ల ఎన్‌ఐఎ దాడులు నిర్వహించింది.

  • Written By:
  • Updated On - May 31, 2023 / 11:51 AM IST

Plot To Kill Pm Modi : కర్ణాటకలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) రైడ్స్ నిర్వహిస్తోంది. దక్షిణ కన్నడ జిల్లాలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి సంబంధించిన 16 చోట్ల ఎన్‌ఐఎ దాడులు నిర్వహించింది. మంగళూరు, పుత్తూరు, బెల్తంగడి, ఉప్పినంగడి, వేణూరు, బంట్వాళాలో ఉన్న పీఎఫ్‌ఐ కార్యకర్తలకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఆసుపత్రుల్లో  సోదాలు జరిగాయి. స్థానిక పోలీసుల సహకారంతో అనుమానిత వ్యక్తుల నుంచి సేకరించిన డాక్యుమెంట్స్ ను అధికారులు వేరిఫై చేస్తున్నారు. మహ్మద్‌ హరీస్‌ కుంబ్రా, సజ్జాద్‌ హుస్సేన్‌ కోడింబాడి, ఫైజల్‌ అహ్మద్‌ తరిగుద్దె, సంషుద్దీన్‌ కుర్నాడ్క అనే నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Also read : Threaten To Murder PM Modi :  ప్రధాని మోడీని చంపేస్తానని కాల్.. చేసింది ఎవరంటే ?

2022  జూలై 12న పాట్నా పర్యటన సందర్భంగా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకోవడానికి PFI కుట్ర (Plot To Kill Pm Modi) పన్నిందని PFI సభ్యుడు షఫీక్ పాయెత్‌పై గత సంవత్సరం సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొంది. ఇప్పుడు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించేందుకే ఎన్‌ఐఏ దాడులు జరుగుతున్నాయి. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్నేందుకు గల్ఫ్ దేశాల నుంచి పీఎఫ్‌ఐకి డబ్బులు అందాయనే అభియోగాలు ఉన్నాయి. కాగా, 2022లో బీహార్ లోని పాట్నాలో ఉన్న ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఎన్‌ఐఎ జరిపిన దాడుల్లో.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఐదుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. వారిలో ఒక వ్యక్తే PFI సభ్యుడు షఫీక్ పాయెత్‌.