Site icon HashtagU Telugu

TDS New Rules: ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్ కొత్త రూల్స్

New Tds Rules From April 1

New Tds Rules From April 1

TDS New Rules : ఏప్రిల్ 1, 2025 నుండి టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) నిబంధనల్లో పెద్ద మార్పులు అమలులోకి రానున్నాయి. యూనియన్ బడ్జెట్-2025లో ప్రభుత్వం ప్రకటించిన ఈ మార్పులు ప్రజలకు, ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పెట్టుబడిదారులకు ఊరటనిచ్చే విధంగా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలతో ఎఫ్‌డీలపై వడ్డీ ఆదాయంపై TDS భారం తగ్గనుంది.

Read Also: UPI transactions : యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం

సీనియర్ సిటిజన్ల FD, RDపై వార్షిక ఆదాయం రూ.లక్ష వరకు ఉంటే TDS వర్తించదు. ప్రస్తుతం రూ.50వేల వరకే ఉంది. అలాగే సాధారణ ప్రజల వడ్డీ ఆదాయం రూ.50వేలు మించకుండా ఉంటే దానిపై బ్యాంకులు TDS కట్ చేయవు. బీమా ఏజెంట్లు, స్టాక్‌ బ్రోకర్లకు వార్షిక కమిషన్‌ ఆదాయం రూ.15,000 మించితే TDS వర్తించేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.20,000కు పెంచారు. ఈ నియమం ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు), రికరింగ్ డిపాజిట్లు (RDలు) ఇతర సేవింగ్స్ విధానాల నుండి వచ్చే వడ్డీకి వర్తిస్తుంది. గతంలో ఒక సంవత్సరంలో గెలిచిన మొత్తం రూ. 10,000 మించితే TDS డిడక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు, ఒక్కో లావాదేవీ రూ. 10,000 కంటే ఎక్కువ ఉంటేనే TDS కట్టబడుతుంది. దీనివల్ల చిన్న మొత్తాలు గెలిచిన వారికి ఊరట కలుగుతుంది.

ఇక సాధారణ పౌరులకు కూడా TDS పరిమితిలో మార్పు జరిగింది. ఇప్పటివరకు రూ. 40,000గా ఉన్న వడ్డీ ఆదాయం పరిమితిని రూ. 50,000కి పెంచారు. ఒకవేళ మీ వడ్డీ ఆదాయం రూ. 50,000లోపు ఉంటే, బ్యాంకు TDSని డిడక్ట్ చేయదు. ఎఫ్‌డీ వడ్డీ ఆదాయంపై ఆధారపడే వారి పన్ను భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక లాటరీ సంబంధిత TDS నిబంధనలను కూడా ప్రభుత్వం సరళీకరించింది. ఇన్సూరెన్స్ ఏజెంట్లు, బ్రోకర్లు, ఇన్సూరర్లకు కూడా TDS పరిమితి పెంచడం ద్వారా ప్రయోజనం కల్పించారు. ఇన్సూరెన్స్ కమీషన్‌పై TDS లిమిట్ రూ. 15,000 నుండి రూ. 20,000కి పెరిగింది. ఈ మార్పు వారి ఆదాయంపై పన్ను భారాన్ని కొంత తగ్గిస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ మరియు షేర్లలో పెట్టుబడి పెట్టే వారికి కూడా శుభవార్త. డివిడెండ్ ఆదాయంపై TDS పరిమితి రూ. 5,000 నుండి రూ. 10,000కి పెంచబడింది. దీనివల్ల ఈ పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయంపై TDS భారం తగ్గుతుంది.

Read Also: Jasprit Bumrah: ముంబై ఇండియ‌న్స్‌కు బిగ్ షాక్‌.. తొలి మ్యాచ్‌కు స్టార్ ప్లేయ‌ర్లు దూరం!