మనుషుల జీవితాల్లోకి ఎప్పుడైతే సోషల్ మీడియా (Social Media) ప్రవేశించిందో, అప్పట్నుంచే చిత్ర విచిత్ర సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ఇక ఇన్ స్టా, ట్విట్టర్ వాడకం పెరగడంతో క్రేజీ వీడియోలు షేర్ చేయడం ట్రెండ్ గా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట తమ ఫస్ట్ నైట్ వీడియో (First Night)ను షేర్ చేయడంతో నెటిజన్స్ షాక్ అయ్యారు.
అరుషి, రాహుల్ అనే జంట ఇటీవలనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జీవితం, లక్ష్యాలు ఎలా ఉంటాయో అని చెప్పేందుకు పలు వీడియోలను షేర్ చేశారు. అయితే ఏ జంటకు అయినా ఫస్ట్ నైట్ సో స్పెషల్. కొత్తగా పెళ్లైన జంటకు ఒకవైపు టెన్షన్, మరోవైపు ఉత్సాహం ఉంటుంది. అయితే ఫస్ట్ నైట్ (First Night) ఊహించుకున్నంతగా ఉండదని అంటోంది ఈ జంట.
ఫస్ట్ నైట్ రియాలిటీ వర్సెస్ ఎక్స్‌పెక్టేషన్‌గా అంటూ తమ శోభనం వీడియో ను షేర్ చేశారు. ‘మేము మా పెళ్లి రాత్రిని ఎలా గడిపాం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మొదట భర్త భార్యను ముద్దుపెట్టుకోవడంతో మొదలవుతుంది. ఆపై ఆమె భారీ నగలు, వివాహ అలంకరణను తీసివేయడంతో ముగుస్తుంది. ప్రస్తుతం (First Night) ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాపం కొత్త జంట ఎన్ని బాధలో అంటూ కొందరు, కూల్ బ్రదర్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోపై లుక్ వేయ్యండి మరి.
Also Read: Corona Cases: కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 3,016 పాజిటివ్ కేసులు