Site icon HashtagU Telugu

NEET : నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటన..కీలక సూత్రధారి అరెస్టు..!

Neet Paper Leak Incident..k

NEET paper leak incident..key mastermind arrested..!

NEET Exam Paper Leakage: నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీలో కీలక సూత్రధారిగా భావిస్తున్న రాజేశ్‌ రంజన్‌(Rajesh Ranjan)ను సీబీఐ (CBI)అధికారులు పాట్నాలో అరెస్టు(arrest) చేశారు. బిహార్‌లోని నవాడ అతని స్వగ్రామం. రంజన్‌ కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు. అయితే అతను నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాసి చింటూ మొబైల్‌కు పంపాడు. అరెస్టు అనంతరం పట్నా, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ నేరానికి సంబంధించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. నిందితుడిని విచారించేందుకుగాను స్థానిక కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో బుధవారం ఇద్దరిని అరెస్టు చేయగా.. ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య పది దాటింది.

We’re now on WhatsApp. Click to Join.

దేశవ్యాప్తంగా నీట్‌(NEET)పై ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొంత మంది అభ్యర్థులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ అయ్యారు. నీట్‌ పరీక్షపై గందరగోళం, కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యం తద్వారా విద్యా సంవత్సరం మరింత ఆలస్యంగా మొదలుకావడం వంటి అంశాలను చర్చించినట్లు సమాచారం. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున.. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని కేంద్ర మంత్రి చెప్పినట్లు తెలిసింది. నీట్‌ పరీక్ష మరోసారి పెట్టాలని డిమాండ్లు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం లీకేజ్‌ స్థానికంగానే ఉందని చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లోనూ పేపర్లు వ్యాప్తి చెందలేదని పేర్కొంటోంది. మరోవైపు వీటికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపడుతోన్న సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది.

Read Also: KTR : మీ ఇద్దరిలో సన్నాసి ఎవరు..? – కేటీఆర్ ట్వీట్