UPI ID – December 31 : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ సంస్థలకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలకమైన సర్క్యులర్‌ను జారీ చేసింది. ఏడాదిగా లేదా అంతకంటే ఎక్కువ కాలంగా వాడకుండా ఇన్ యాక్టివ్‌గా వదిలేసిన యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని యూపీఐ యాప్స్ సంస్థలను ఆదేశించింది. ఖాతాదారులు తమ పాత నంబర్‌ను బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తొలగించకుండా కొత్త నంబర్‌ను వినియోగంలోకి తెస్తే .. పాత నంబరుతో ముడిపడి ఉన్న యూపీఐ ఐడీలకు డబ్బు చేరే రిస్క్ ఉన్నందున ఈ జాగ్రత్త చర్యను చేపట్టామని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. డిసెంబరు 31లోగా తమ ఆర్డర్స్‌ను అమలు చేయాలని యూపీఐ యాప్స్ సంస్థలకు నిర్దేశించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఎవరైనా ఒక ఫోన్ నంబరును 90 రోజుల పాటు వాడకుండా వదిలేస్తే అది డీయాక్టివేట్ అవుతుంది. అనంతరం అదే నంబరును ఇతరులకు కేటాయించే అధికారం టెలికాం కంపెనీలకు ఉంటుంది. అలా ఫోన్ నంబర్లు మారే క్రమంలో.. వాటితో ముడిపడిన యూపీఐ ఐడీలతో ఆర్థిక లావాదేవీల సమస్యలు తలెత్తకుండా నిలువరించే ప్రయత్నాలపై ఎన్పీసీఐ ఫోకస్ చేసింది. ఇక బ్యాంకులు కూడా వాటి యూపీఐ యాప్‌ల నుంచి 1 సంవత్సరం పాటు ఎటువంటి లావాదేవీలను నిర్వహించని కస్టమర్ల యూపీఐ ఐడీలు, అనుబంధిత యూపీఐ ఫోన్ నంబర్లను గుర్తించాలని సూచించింది. యూపీఐ ఐడీలు, యూపీఐ నంబర్లను డీయాక్టివేట్ చేయడం ద్వారా.. వాటికి ఎవరూ డబ్బులు పంపకుండా నిలువరించాలని ఆదేశించింది. NPCI తాజా సర్క్యులర్ ప్రకారం.. డిజిటల్ చెల్లింపుల రంగంలో సురక్షితమైన లావాదేవీల అనుభవాన్ని నిర్ధారించడానికి కస్టమర్లు తమ సమాచారాన్ని క్రమం తప్పకుండా సమీక్షించడం, ధృవీకరించడం(UPI ID – December 31) అవసరం.
