Site icon HashtagU Telugu

Nagasaki Day : నాగసాకి డే.. “ఫ్యాట్ మ్యాన్”.. అమెరికా అణుబాంబు కల్లోలం

Nagasaki Day

Nagasaki Day

Nagasaki Day : ఇవాళ (ఆగస్టు  9) నాగసాకి డే..

రెండో ప్రపంచ యుద్ధం టైం అది..

ఓ వైపు జపాన్ .. మరోవైపు అమెరికా, రష్యా, బ్రిటన్ ల సంకీర్ణ సైన్య కూటమి..

సంకీర్ణ సైన్య కూటమి తరఫున అమెరికా ఆర్మీ జపాన్ పై విరుచుకుపడింది..

1945 సంవత్సరంలో ఆగస్టు  9న  జపాన్ నగరం నాగసాకిపై  అమెరికా అణుబాంబుతో దాడికి తెగబడింది.

Also read : Today Horoscope : ఆగస్టు 9 బుధవారం రాశి ఫలితాలు.. ఆ రాశి వారికి బ్యాడ్ టైం

జపాన్ లోని హిరోషిమా సిటీపై (ఆగస్టు  6న)  అణుబాంబు వేసిన మూడు రోజుల తర్వాత  నాగసాకిపై  అమెరికా ఈ దాడి చేసింది. నాగసాకిపై అమెరికా వేసిన అణుబాంబుకు “ఫ్యాట్ మ్యాన్” అనే కోడ్ నేమ్ పెట్టారు.  అమెరికా యుద్ధ విమానం ‘ఫ్యాట్ మ్యాన్’ అణుబాంబును  1,650 అడుగుల ఎత్తు నుంచి నాగసాకిపై వేసింది. అది 80,000 మందిని చంపింది. ఆ తర్వాత రేడియేషన్ సంబంధిత వ్యాధులతో ఇంకో 70,000 మంది మరణించారు. ఆగస్టు  6న హిరోషిమా సిటీపై  వేసిన అణుబాంబుకు “లిటిల్ బాయ్” అనే కోడ్ నేమ్ పెట్టారు. అది 60,000 మందిని చంపింది. నాగసాకిపై  దాడి జరిగిన 6 రోజుల తర్వాత (ఆగస్టు 15న) జపాన్ బేషరతుగా సరెండర్ అయింది. దీంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుదాడిలో చాలామంది ప్రాణాలతో బయటపడినా.. వారు రేడియేషన్‌కు గురికావడం వల్ల క్యాన్సర్ లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఏళ్ళ తరబడి వెంటాడాయి. హిరోషిమా, నాగసాకి ప్రాంతాల వారిని చాలా ఏళ్లపాటు కొందరు రోగగ్రస్తులుగా చూసేవారు.  ప్రపంచ శాంతిని పెంపొందించడానికి, అణ్వాయుధాల ముప్పు గురించి దేశాలకు అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా నాగసాకి దినోత్సవాన్ని(Nagasaki Day) జరుపుకుంటున్నారు. ఈ రోజు అనేక దేశాలలో యుద్ధ వ్యతిరేక, అణు వ్యతిరేక నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు.

Also read : Asatoma Sadgamaya : మీ జీవితాన్ని మార్చేసే గొప్ప మంత్రం