Actor Mohan babu : మంచు కుటుంబంలో తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా నటుడు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రిపోర్టర్ పై దాడి కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే తనకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. మోహన్ బాబు తరఫున నగేష్ రెడ్డి, మురళి ఈ పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం 2.30కి విచారించనుంది.
మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. బౌన్సర్లతో పాటూ మోహన్ బాబు విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని అదేశాలు ఇచ్చింది. రిపోర్టర్ పై దాడి చేసినందుకు ఆయనపై BNS118 సెక్షన్ కింద షహర్ పహాడీ పీఎస్ లో కేసు నమోదు చేశారు. మోహన్ బాబు వ్యతిగత విచారణకు హాజరు కావాలని రాచకొండ సీపీ నోటీసులు పంపించారు.
ఇకపోతే.. మోహన్ బాబు అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరడంతో ఈరోజు విచారణకు హాజరు కాలేకపోయారు. వైద్యులు కూడా రెండు రోజుల పాటు వైద్యుల సంరక్షణలోనే ఉండాలని చెప్పడంతో ఆయన విచారణకు హాజరు కావడం లేదు. ప్రస్తుతం మోహన్ బాబుకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు అటు మోహన్ బాబు దాడి చేసిన రిపోర్ట్ రంజిత్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. అతని దవడపైన ఉండే జైగోమాటిక్ ఎముక మూడు చోట్లు విరిగిందని వైద్యులు నిర్థరించారు. రిపోర్ట్ కు ప్లాస్టిక్ సర్జరీ అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు. రిపోర్ట్ అయ్యప్ప మాలలో ఉన్నాడు.
Read Also: Myntra Refund Scam: ప్రముఖ ఈ- కామర్స్‌ను మోసం చేసిన కేటుగాళ్లు.. రూ. 50 కోట్ల నష్టం!