Site icon HashtagU Telugu

Mohan Babu Attack : మీడియా పై మోహన్ బాబు దాడి..చూస్తూ ఉండిపోయిన పోలీసులు

Mohanbabu Attack Manoj

Mohanbabu Attack Manoj

మోహన్ బాబు (Mohan Babu) మరోసారి తన నిజస్వరూపం చూపించాడు. మోహన్ బాబు కు విపరీతమైన కోపం అని..నోటికి ఇదివస్తే అది అనేస్తారని..అవతల వ్యక్తులు ఎవరు అనేది కూడా చూడరని చాలామంది చెపుతుంటారు. పలు సందర్భాలలో పలు ఘటనలు కూడా రుజువు చేసాయి. గతంలో మా ఎన్నికల సమయంలో తోటి కళాకారుడి పై కూడా అసభ్య పదజాలం వాడి వార్తల్లో నిలిచారు. ఈరోజు ఏకంగా మీడియా ప్రతినిధులపైనే దాడి చేసి గాయపరిచాడు.

గత రెండు రోజులుగా మీడియా లో మోహన్ బాబు vs మంచు మనోజ్ గొడవ హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకొని తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఇదే క్రమంలో ఈరోజు ఉదయం మంచు విష్ణు దుబాయ్ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు రావడంతోనే మంచు మనోజ్ ను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. మనోజ్, ఆయన భార్యతో పాటు మనోజ్ అనుచరులందర్నీ బయటకు పంపేశారు. తర్వాత ఆయనకు చెందిన వస్తువులు ఇంట్లో ఉండకుండా ప్రత్యేక వాహనాలను తెప్పించి అందులో లోడ్ చేసి పంపించేశారు. ఇంటి నుంచి పంపేయడంతో మనోజ్, మౌనిక పోలీసు ఉన్నతాధికారుల్ని కలిశారు. మొదట ఇంటలిజెన్స్ డీజీని కలిసి తమ కుటుంబంలో జరిగిన పరిణామాల్ని వివరించారు. తర్వాత డీజీపీని కూడా కలిశారు. న్యాయం చేయాలని కోరారు. పోలీసులు పూర్తిగా మోహన్ బాబు వైపు ఉన్నారని తనపై దాడి చేసిన వారిని కూడా పట్టుకోవడం లేదని మనోజ్ వాపోయాడు.

సాయంత్రం మనోజ్ జలపల్లిలోని మంచు టౌన్ వద్దకు చేరుకొని లోపల తన కూతురు ఉంది..లోపలి వెళ్లాలని సెక్యూర్టీ అడిగాడు..వారు ఇంతకు గేటు ఓపెన్ చేయలేదు. దీంతో తన ప్రవైట్ సెక్యూరిటీ తో కలిసి గేట్లను ఓపెన్ చేసి లోపలి వెళ్ళాడు.. ఇదే క్రమంలో అక్కడే ఉన్న మీడియా సైతం లోపలి వెళ్ళింది. సరిగ్గా అక్కడే ఉన్న మోహన్ బాబు..మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. టీవీ9 మైక్ లాక్కొని ప్రతినిధి పై దాడి చేయడంతో పాటు బూతులు తిడుతూ రెచ్చిపోయారు. మీడియా పై మోహన్ బాబు దడి చేస్తున్నప్పటికీ ఆ పక్కనే ఉన్న పోలీసులు మోహన్ బాబు ను ఆపకపోగా…సినిమా చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయారు.

మోహన్ బాబు ఘటనలో కొన్ని మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. ప్రస్తుతం వారిని హాస్పటల్ కు తరలించారు. ఈ ఘటన పట్ల యావత్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇటు మనోజ్ దంపతులు సైతం మోహన్ బాబు తమను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మోహన్ బాబు తన ప్రాణానికి గండం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఆయన తీరు చూస్తే ఆయన వల్లనే ఇతరులకు ప్రమాదం పొంచి ఉందని అర్ధం అవుతుంది.

మంచు మనోజ్, ఆయన భార్య లోపలికి వెళ్తే విష్ణు నియమించిన బౌన్సర్లు వారి పై దాడి చేశారు. ఆయన చొక్కా చింపేసి బయటకు పంపించారు. ఏడు నెలల మనోజ్ కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. తన కుమార్తెను చూడనివ్వకుండా దాడి చేసి పంపేశారని మనోజ్ చెబుతున్నారు. మోహన్ బాబు వద్ద గన్ ఉండటం ఆయన దాన్ని స్పాట్ లోకి తెచ్చినట్లుగా పోలీసులు గుర్తించడంతో వెంటనే ఆయన గన్ లైసెన్స్ రద్దు చేసినట్లుగా సమాచారం ఇచ్చి స్వాధీనం చేసుకున్నారు. మంచు విష్ణు గన్ లైసెన్స్ కూడా రద్దు చేసి గన్ స్వాధీనం చేయాలని ఆదేశించారు. మొత్తం మీద మోహన్ బాబు చర్య పట్ల అందరు ఛీ కొడుతూ..మనోజ్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Read Also : Collectors Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులు కలెక్టర్ల సదస్సు ..!