Abdul Kalam-Grinder : అబ్దుల్ కలాం.. ఒక చెక్కు.. ఒక గ్రైండర్.. స్ఫూర్తి రగిల్చే స్టోరీ

Abdul Kalam-Grinder : దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మన దేశంలో కోట్లాది మందికి స్ఫూర్తి ప్రదాత.. ఆయన జీవితం తెరిచిన పుస్తకం.. 

Published By: HashtagU Telugu Desk
Abdul Kalam Grinder

Abdul Kalam Grinder

Abdul Kalam-Grinder : దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మన దేశంలో కోట్లాది మందికి స్ఫూర్తి ప్రదాత.. 

ఆయన జీవితం తెరిచిన పుస్తకం.. 

ఆయన సింప్లిసిటీ అందరినీ ఆకట్టుకునేది..  

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వాన్ని మనం అబ్దుల్ కలాం జీవితం నుంచి నేర్చుకోవచ్చు.    

తాజాగా అలాంటిదే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది..

Also read : Apple Feature In Android : త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలోకి యాపిల్ ఫోన్ ఫీచర్ !

మన మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం ఆదర్శ జీవితాన్ని అద్దంపట్టే ఒక ఘటన వివరాలను ఇటీవల IAS అధికారి ఎంవీ రావు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కలాం నైతికతతో ఎలా జీవించారనేది  ఆ పోస్ట్ లో మన కళ్ళకు కట్టేలా వివరించారు.  దాని ప్రకారం.. 2014లో డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఒక ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ ప్రోగ్రాంకు  సౌభాగ్య వెట్ గ్రైండర్స్  అనే సంస్థ స్పాన్సర్‌గా ఉంది. ప్రోగ్రామ్స్ ముగిసిన తర్వాత ఆ సంస్థ ముఖ్య అతిథులు అందరి ఇళ్లకు గ్రైండర్‌లను గిఫ్ట్ గా పంపింది. ఈక్రమంలోనే డాక్టర్ కలాం నివాసానికి కూడా ఒక గ్రైండర్‌ను గిఫ్ట్ గా పంపించింది.  అయితే తనకు ఆ గిఫ్ట్ వద్దని కలాం చెప్పారు. కానీ స్పాన్సర్ పట్టుబట్టడంతో ఆ గ్రైండర్‌ను ఇంట్లో ఉంచుకున్నారు.

Also read : BRS MLA Candidates: కేసీఆర్ ఖరారు చేసిన 78 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లేనా?

గ్రైండర్ ను వెనక్కి పంపిస్తానన్న కలాం

కానీ మరుసటి రోజు గ్రైండర్(Abdul Kalam-Grinder) మార్కెట్ ధరకు సంబంధించిన చెక్కును సౌభాగ్య వెట్ గ్రైండర్స్  అనే సంస్థ కు కలాం పంపారు. అయితే ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు కంపెనీ నిరాకరించింది. తన అకౌంట్ నుంచి డబ్బులు తీసివేయబడలేదని గుర్తించిన కలాం.. సౌభాగ్య వెట్ గ్రైండర్స్ ప్రతినిధికి కాల్ చేసి చెక్కును బ్యాంకులో  డిపాజిట్ చేయమని కోరారు. ఒకవేళ తన చెక్కును అంగీకరించకుంటే..  గ్రైండర్ ను వెనక్కి పంపిస్తానని కలాం తేల్చి చెప్పారు. దీంతో కలాం మాటను కాదనలేక.. ఆయన పంపిన రూ.4850 SBI చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసింది. కలాం యొక్క వ్యక్తిత్వంతో ఎంతో ప్రభావితమైన  సౌభాగ్య వెట్ గ్రైండర్స్ నిర్వాహకులు .. కలాం సంతకం చేసిన చెక్కు ఫోటోకాపీని ఫ్రేమ్ చేసి  తమ ఆఫీసులో అమర్చారు.  ఈమేరకు వివరాలతో IAS అధికారి ఎంవీ రావు చేసిన ట్వీట్ కు వేలాదిగా లైక్స్  వచ్చాయి.

  Last Updated: 13 Aug 2023, 02:29 PM IST