ELECRAMA : ELECRAMA 2025 3వ రోజున భారతదేశపు శక్తి పరివర్తన, పాలసీ దిశ, మరియు సాంకేతిక పురోగతుల పై కీలకమైన చర్చల కోసం మంత్రి పీయుష్ గోయల్, కామర్స్ & పరిశ్రమల శాఖ, భారత ప్రభుత్వం రంగాన్ని సిద్ధం చేయడానికి కీలకమైన ప్రసంగం చేసారు. స్వదేశీ తయారీని శక్తివంతం చేయడానికి ప్రభుత్వ నిబద్ధత, పరిశుభ్రమైన శక్తిని అవలంబించడాన్ని ప్రోత్సహించడానికి మరియు వినూత్నత మరియు సహకారం ద్వారా విద్యుత్తు రంగాన్ని భవిష్యత్తు కోసం సిద్ధం చేయడాన్ని నిర్థారించవలసిన ప్రాధాన్యతను సునీల్ సింఘ్వి, ప్రెసిడెంట్, IEEMA, విక్రమ్ గండోట్ర, ప్రెసిడెంట్ (ఎలక్ట్) మరియు ఛైర్మన్, మరియు సిద్ధార్థ భుటోరియ, వైస్ ప్రెసిడెంట్, IEEMA & వైస్ ఛైర్మన్, ELECRAMA 2025, వంటి నాయకులతో కలిసి పీయుష్ గోయల్ తెలియచేసారు. సుస్థిరమైన శక్తి పరిష్కారాల్లో అంతర్జాతీయ నాయకునిగా మారవలసిన భారతదేశపు కలను ఆయన ప్రసంగం మద్దతునిచ్చింది. పాలసీ మద్దతు, వ్యూహాత్మకమైన పరిశ్రమ భాగస్వామాలు, మరియు ఆధునిక సాంకేతికతలలో పెట్టుబడి ప్రాధాన్యతను తెలియచేసారు.
Read Also: Ibrahim Zadran: ఛాంపియన్స్ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్!
ఏకీకృత ప్రపంచ స్థాయికి చెందిన ప్రదర్శన వేదికను నిర్మించవలసిందిగా, భారతదేశాన్ని విద్యుత్తు మరియు శక్తి పరిష్కారాల కోసం అంతర్జాతీయ గమ్యస్థానంగా నిలబెట్టవలసిందిగా భారతదేశపు విద్యుత్తు పరిశ్రమను పీయుష్ గోయల్, యూనియన్ కావర్స్ & ఇండస్ట్రీ, భారత ప్రభుత్వం అభ్యర్థించారు. ELECRAMAలో మాట్లాడుతూ.. ELECRAMA సహా ఇతర పరిశ్రమలో నాయకత్వంవహించే ప్రధానమైన ఎగ్జిబిషన్స్ విలీనమైన ఒక ప్రదర్శనగా ఉండవలసిన ప్రాధాన్యతను మరియు అంతర్జాతీయ భాగస్వాముల కోసం భారతదేశాన్ని ఏకైక వేదికగా ఉంచవలసిన అవసరాన్ని ఆయన తెలియచేసారు.
“అంతర్జాతీయ శక్తి పరివర్తనలో భారతదేశం ముందంజలో ఉంది మరియు ఈ పరివర్తనలో మన విద్యుత్తు పరిశ్రమ కీలకమైన బాధ్యతవహిస్తుంది. బహుళ విభాగాల ఎక్స్ పోస్ ను నిర్వహించడానికి బదులుగా, ప్రపంచాన్ని మన పూర్తి సామర్థ్యాలను చూపించడానికి ఒకే, అతి పెద్ద కార్యక్రమాన్ని తయారు చేయడానికి మనం తప్పనిసరిగా కలిసికట్టుగా ముందుకు రావాలి. 1,500 ఎగ్జిబిటర్స్, 100,000+ సందర్శకులతో మరియు అతి పెద్ద అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొనే ఎగ్జిబిషన్ ను ఊహించండి. ఇది భారతదేశాన్ని అంతర్జాతీయ విద్యుత్తు రంగానికి ప్రధానమైన కేంద్రంగా దృఢంగా స్థిరపరుస్తుంది ” అని పీయుష్ గోయల్ అన్నారు.