Zuckerberg Phone : సోషల్ మీడియాలో ఫేస్ బుక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు..
ఫేస్ బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ .. చిన్న వయసులోనే బాగా సక్సెస్ అయిన వ్యాపారవేత్తల్లో ఒకరు.
ఆయన హాబీస్ గురించి చాలామంది నిత్యం ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంటారు..
తాజాగా ప్రముఖ టెక్ యూట్యూబర్ మార్క్వెస్ కీత్ బ్రౌన్లీ (MKBHD)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన హాబీస్, ఫెవరేట్స్ గురించి జుకర్‌బర్గ్ ఇలా చెప్పారు.
Also read : Snacks for Diabetes: మధుమేహం ఉన్నవారు ఈ 5 రకాలను స్నాక్స్‌లో ట్రై చేయండి..!
“మీ జేబులో ఇప్పుడున్న ఫోన్ ఏ కంపెనీది ?” అని జుకర్‌బర్గ్ ను కీత్ బ్రౌన్లీ అడిగాడు. జుకర్‌బర్గ్ బదులిస్తూ.. “నా జేబులో శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉంది. శామ్‌సంగ్ ఫోన్లు అంటే నాకెంతో ఇష్టం. వాటిని చాలా బాగా తయారు చేస్తారు. నేను ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మ్యాను ఫ్యాక్చరర్ (OEM)తో స్పెషల్ గా తయారు చేయించుకున్న మరో ఆండ్రాయిడ్ ఫోన్ ను(Zuckerberg Phone) కూడా చాలా సంవత్సరాలు వాడాను” అని చెప్పాడు.
Also read :PAN-Aadhaar Linking : పాన్-ఆధార్ లింక్.. రూరల్ పోస్టాఫీసుల్లో త్వరలో కొత్త సర్వీస్ ?
శామ్‌సంగ్, ఫేస్‌బుక్ బంధం స్ట్రాంగ్
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. శామ్‌సంగ్, ఫేస్‌బుక్ కంపెనీలు వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ డెవలప్మెంట్ కు సంబంధించిన వివిధ ప్రాజెక్ట్‌లపై గతంలో కలిసి పనిచేశాయి. శామ్‌సంగ్ కు చెందిన వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ “Samsung Gear VR” లో ఫేస్ బుక్ యొక్క Oculus టెక్నాలజీని వినియోగించారు. శామ్‌సంగ్ Galaxyకి చెందిన అన్ని పరికరాలలో Facebook యాప్‌లు ముందే ఇన్‌స్టాల్ చేసి రెడీగా ఉంటాయి. ఇదంతా ఫేస్ బుక్, శామ్‌సంగ్ మధ్య ఉన్న పరస్పర అవగాహనా ఒప్పందాల వల్ల జరుగుతోంది. ఇవన్నీ కలిసి శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లను మార్క్ జుకర్‌బర్గ్ కు హాట్ ఫెవ రేట్ గా మార్చాయి.