మహారాష్ట్ర – ఝార్ఖండ్ లలో జరిగిన ఎన్నికల కౌటింగ్ (Maharashtra – Jharkhand Elections 2024) కొనసాగుతుంది. మహారాష్ట్రలో (Maharashtra) మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగగా.. మొత్తం 4,136 మంది బరిలోకి దిగారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అలాగే ఝార్ఖండ్‌లో 38 స్థానాలకు గాను రెండో విడత పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ, అజిత్ పవార్-ఎన్సీపీ, ఏకనాధ్ శిందే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. దీనికి పోటీగా కాంగ్రెస్, శివ సేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) కలిసి మహావికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి. దీంతో ఈసారి మహారాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది.
కాగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో బిజెపి అభ్యర్థుల తరుపున జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఫలితాలు ఎలా వస్తున్నాయి..? పవన్ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల గెలుపు ఖాయమేనా..? పవన్ ప్రచారం బిజెపి కి కలిసొచ్చిందా..? లేదా..? మద్దతు ఇచ్చిన అభ్యర్థుల ఫలితాలు ఇలా ఉన్నాయనేది తెలుసుకోవాలని దేశ ప్రజలంతా ఆసక్తి కనపరుస్తున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ..పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ అధిక్యంలో ఉంది. NDA తరఫున పుణె, బల్లార్పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్ నియోజకవర్గాల్లో జనసేనాని క్యాంపెయిన్ చేశారు. అక్కడ బిజెపి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ హిందుత్వ, సనాతన ధర్మం, మరియు ప్రాంతీయ అంశాలపై తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తర్వాత.. జమ్ము కాశ్మీర్ లో శాంతి కనిపిస్తుందని, అద్భుత అయోధ్య నిర్మాణం సాధ్యమైందని, నలువైపుల నూతన రోడ్లు నిర్మాణమవుతున్నాయంటూ చెప్పుకొచ్చారు.
అలాగే బీజేపీ హాయలోనే దేశంలోని రైతులు, పారిశ్రామిక వేత్తలకు అందుతున్న ప్రయోజనాల్ని పేర్కొన్నారు. సనాతన ధర్మం కోసం నిజ జీవితంలో పోరాడడం అనేది సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలను చేయడంలా తేలికగా ఉండదని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర దేవాలయాలు, సంస్కృతి, భాష భద్రంగా ఉండటానికి శివాజీ చేసిన కృషిని పవన్ గుర్తుచేశారు. శివాజీ నేలపై బెదిరింపులకు తాము భయపడమని స్పష్టంగా హెచ్చరించారు. మహాయుతి కూటమికి వ్యతిరేకంగా అఘాడీ కూటమిలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. శివసేనా వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రే.. దేశాన్ని రక్షించేందుకు, బలమైన దేశ నిర్మాణానికి కృషి చేశారని పొగడ్తలు కురిపించారు. మనమంతా విడిపోయి బలహీన పడిపోదామా.? కలిసి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర లక్షకోట్ల ఆర్థిక వ్యవస్థ కోసం మహాయుతి కూటమి ప్రయత్నిస్తోందన్న పవన్ కళ్యాణ్.. అందుకు మద్ధతుగా నిలవాలని . మన దేశం కోసం, మన ధర్మం కోసం నిలబడాలంటూ కార్యకర్తక దిశానిర్దేశం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మరాఠి సంస్కృతి కోసం, మరాఠి భాష కోసం ప్రజలంతా మహాయుతి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఓటర్లు బిజెపి అభ్యర్థులకు మద్దతు పలికినట్లు తెలుస్తుంది. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ ప్రచారం చేసిన షోలాపూర్ సహా నాందేడ్, నయాగావ్, భోకర్ ప్రాంతాల్లో సైతం మహాయుతి ఆధిక్యంలో ఉండటం గమనార్హం.
Read Also : CM Chandrababu: పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం