Jaipur : రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. రద్దీగా ఉండే అజ్మీర్ రోడ్డులో ఈ రోజు ఉదయం ఎల్పీజీ, సీఎన్జీ ట్యాంకర్లు ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పదుల సంఖ్యలో వాహనాలు దగ్ధమయ్యాయి. జైపూర్‌లోని అజ్మీర్ రోడ్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ పేలుడులో 34 మంది ప్రయాణికులతో నిండి ఉన్న స్లీపర్ బస్ కూడా పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో 34 మందిలో 20 మంది తీవ్రంగా గాయపడగా, మరో 14 మంది అందులో డ్రైవర్ మరియు కండక్టర్ కనిపించడంలేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అజ్మీర్ రోడ్డు.. భంక్రోటా ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ సీఎన్‌జీ నింపిన గ్యాస్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. ఎవరికీ ఏమీ అర్థం కాకముందే ట్యాంకర్ చుట్టూ ఉన్న 15-20 వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గర్‌లోనే పెట్రోల్ బంకు ఉన్నా.. అక్కడ మంటలు చెలరేగకపోవటం విశేషం.
అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే, అజ్మీర్ రోడ్డులోని ఈ ప్రాంతంలో అతి వేగంతో నడిచే వాహనాల చక్రాలు నిలిచిపోయాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారిపై కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ అగ్నిప్రమాద వార్తతో పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే 20కి పైగా అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి.
కాగా, ఎల్పీజీ, సీఎన్జీ ట్యాంకర్లు ఢికొన్న అనంతరం ట్యాంకర్ నుండి వాయు లీకవడంతో 18 టన్నుల గ్యాస్ వాతావరణంలో వ్యాపించింది. కొన్ని సెకన్ల తర్వాత భారీ పేలుడు చోటు చేసుకుంది. దీంతో మంటలు అనేక కిలోమీటర్ల వరకు వ్యాపించాయి. ఈ పేలుడు కారణంగా ట్యాంకర్, ట్రక్ మరియు హైవే మీద నిలిచిన అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి. అంతేకాక. ఈ మంటల కారణంగా కొన్ని పక్షులు కూడా కాల్చిపోయాయి. ఒక బైక్ సవారీ చేసే వ్యక్తి హెల్మెట్ అతని ముఖంతో చీప్ కిప్పోగా అతని కళ్లకు కూడా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సవాయ్ మాన్‌సింగ్ హాస్పిటల్‌కు తరలించారు. వారికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
లేక్ సిటీ ట్రావెల్స్ బస్ గురువారం రాత్రి 9 గంటలకు ఉదయపూర్ నుండి బయలుదేరింది. ఆ సమయంలో బస్‌లో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక ప్రయాణికుడు అజ్మీర్ లో దిగిన తర్వాత, బస్ ఉదయం 6:30కు జయపూర్ చేరాల్సి ఉండగా, ఉదయం 5:45 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. బస్ ప్రయాణికులు చెప్తున్నారు. అయితే బస్ టోర్‌కు తాళం వేసి ఉండటంతో, ప్రజలు బయటకు రాలేకపోయారు. దీంతో కొంతమంది మరణించిపోయారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ మొదటగా మంటలలో చిక్కుకున్నాడు. దీంతో మంటలు ఎక్కువగా వ్యాపించడంతో 2-3 కి.మీ. పరిధిలో ఉన్న అన్ని వాహనాలు మంటలలో చిక్కుకున్నాయి. మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పెద్ద ఎత్తున పోలీసులు, పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మంటల తీవ్రతతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందారు.
Read Also: 2027 National Olympics: “ఖేలో ఆంధ్రప్రదేశ్” గా ఏపీ…