Lookout Notices : వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాని దేశం విడిచి వెళ్లకుండా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టులు, సీపోర్టులకు పోలీసులు సమాచారం అందించారు. దీంతో ఈ వ్యవహరం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 12 రోజులుగా కాకాణి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి.
Read Also: Young India Police School : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ప్రారంభించిన సీఎం.. ఎక్కడంటే?
ఇప్పటికే కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇక, పోలీసులు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. గోవర్ధన్ రెడ్డి చిన్న అల్లుడు గోపాలకృష్ణారెడ్డి, కాంట్రాక్టర్ ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, ఊరుబిండి చైతన్యలకు నోటీసులు జారీ చేశారు. వారి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని స్పష్టం చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ నేతలను టార్గెట్ చేస్తుందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఇప్పటికే క్వార్ట్జ్ అక్రమ తరలింపు, అట్రాసిటీ, పోలీసులను దూషించిన కేసులను నమోదు చేశారు. తన అనుచరులతో కలిసి విదేశాలకు కలిసి రూ.250 కోట్లకుపైగా విలువ చేసే క్వార్ట్జ్ ఎగుమతి చేసినట్లు ఆరోపణలున్నాయి. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో విదేశాల నుంచి పెద్దమొత్తాల్లో నగదు బదిలీపై పూర్తిస్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కంపెనీలు, కొన్న వ్యక్తులు, వినియోగంపైనా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: FAT : పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును ఇలా చేస్తే ఇట్టే తగ్గిపోందంటున్న డాక్టర్స్