liquor policy Case : లిక్కర్ స్కాం కేసు..మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు

  • Written By:
  • Updated On - April 8, 2024 / 02:35 PM IST

liquor policy Case: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) ఢిల్లీ మధ్యం కుభకోణం కేసు (Delhi liquor policy Case)లో  దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఆప్‌ నేతలకు వరుసగా నోటీసులు ఇస్తోంది. తాజాగా ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు (AAP MLA) ఈడీ నోటీసులు పంపింది. ఎమ్మెల్యే దుర్గేష్‌ పాఠక్‌ (Durgesh Pathak)కు ఈడీ అధికారులు సోమవారం సమన్లు పంపారు. తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. ఈ మధ్యాహ్నం ఆయన ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

‘ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్యే పాఠక్‌కు ఈడీ అధికారులు సమన్లు పంపారు. గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నగదు చెల్లింపులకు సంబంధించి పాఠక్‌ పేరు ప్రస్తావనలోకి వచ్చింది. ఆయన ఇవాళ మధ్యాహ్నం ఈడీ ముందు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు ఈ కేసులో ఇప్పటికే జైలుకెళ్లిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ (Bibhav Kumar)ను కూడా ఈడీ ప్రశ్నించింది. సోమవారం ఉదయం ఈడీ కార్యాలయంలో బిభవ్‌ను అధికారులు ప్రశ్నించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం బిభవ్ కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

Read Also: First Open Debate : భారత ఎన్నికల్లో తొలి ఓపెన్ డిబేట్‌.. సై అంటున్న ఆ ఇద్దరు !

కాగా, మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకూ నలుగురు ఆప్‌ నేతలు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సహా, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు పలు కేసుల్లో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వాళ్లు కూడా ప్రస్తుతం తీహార్‌ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవలే ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ బెయిల్‌పై బయటకు వచ్చారు.