NTR Coin – Buy Now : ‘ఎన్టీఆర్ కాయిన్’ సేల్స్ నేటి నుంచే.. ఇలా కొనేయండి

NTR Coin - Buy Now : మహా నేత, మహా నటుడు ఎన్టీఆర్ పేరిట 100 రూపాయల స్మారక నాణెం విడుదలైన సంగతి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Ntr Coin Released

Ntr Coin Released

NTR Coin – Buy Now : మహా నేత, మహా నటుడు ఎన్టీఆర్ పేరిట 100 రూపాయల స్మారక నాణెం విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 28న ఈ కాయిన్ ను రాష్ట్ర ద్రౌపది ముర్ము రిలీజ్ చేశారు. ఈనేపథ్యంలో అన్నగారి అభిమానులు ఆ కాయిన్ ను ఎప్పుడెప్పుడు కొనాలా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ నాణేన్ని ఎలా కొనాలో తెలుసుకుందాం.ఎన్టీఆర్ రూ.100 కాయిన్ ను ప్యూర్ మెటల్ తో తయారు చేశారు. ఇందులో 50% వెండి, 40% రాగి, 5% జింక్‌, 5% నికెల్‌ మిశ్రమం ఉన్నాయి. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ కాయిన్స్ ను మన హైదరాబాద్ లోని మింట్ లోనే తయారు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నాణేల ముద్రణ జరిగింది. ఈ కాయిన్ ఫై ఉండే ఫోటోను కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే సూచించారు.

Also read : Nagarjuna Birthday Special : ‘హీరోగా పనికి రాడు’ అన్నవాళ్లకు.. నాగార్జున ఎలా ఆన్సర్ ఇచ్చారో తెలుసా ?

ఎన్టీఆర్‌ స్మారక రూ.100 కాయిన్ ధర చెక్క డబ్బాతో అయితే రూ.4,850. ఒకవేళ ప్రూఫ్‌ ఫోల్డర్‌ ప్యాక్‌ లో కావాలంటే దీని ధర రూ.4,380. యూఎన్‌సీ ఫోల్డర్‌ ప్యాక్‌ లో ఈ కాయిన్ ను (NTR Coin – Buy Now) కేవలం రూ.4,050కి సొంతం చేసుకోవచ్చు. ఇవాళ (ఆగస్టు 29) ఉదయం 10 గంటల నుంచి ‘ఇండియా గవర్నమెంట్‌ మింట్‌’ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో లేదా హైదరాబాద్‌లోని సైఫాబాద్‌, చెర్లపల్లిల్లోని మింట్‌ విక్రయ కౌంటర్లలో నేరుగా ఎన్టీఆర్ కాయిన్ ను కొనొచ్చు.  ఈవిషయాన్ని హైదరాబాద్‌లోని ప్రభుత్వ నాణేల ముద్రణ కేంద్రం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వీఎన్‌ఆర్‌ నాయుడు వెల్లడించారు. ఈ కాయిన్ ను కొనదల్చిన వారు https://www.indiagovtmint.in/en/commemorative-coins/ వెబ్ సైట్ ను చూడొచ్చు. 

  Last Updated: 29 Aug 2023, 09:17 AM IST