KTR : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం (ఈరోజు ) ఉదయం 10 గంటలకు హాజరుకానున్నారు. ఈ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, తెలంగాణ భవన్ వద్ద కూడా పోలీసులు మోహరించారు. విచారణకు ముందు, కేటీఆర్ తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో తనపై ఉన్న ఆరోపణలను ఖండించారు. తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి గతంలో మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని, తన బావమరుదులకు రూ.1137 కోట్ల కాంట్రాక్టులు ఇవ్వలేదని, కేబినెట్‌లో ఉండి ఏ కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదని తెలిపారు.
Read Also: Rajamouli 1st Salary : రాజమౌళి ఫస్ట్ సాలరీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
మరోవైపు, కేటీఆర్ ఇంటికి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్, పటోళ్ల కార్తీక్‌రెడ్డి తదితరులు వెళ్లారు. తద్వారా, రాజకీయ వర్గాల్లో ఈ కేసు పై చర్చలు మరింత ఉధృతమయ్యాయి. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా, ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఈ కేసులో మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించగా, కేటీఆర్‌పై అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసు పరిణామాలు మరింత స్పష్టతను పొందే అవకాశం ఉంది.