KTR responded to Konda Surekha comments : నాగచైతన్య విడాకుల వ్యవహారంతో పాటుగా హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్‌కు అలవాటని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. మంత్రి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. తమకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ అర్దం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Kangana On Mahatma Gandhi: గాంధీపై కంగనా రనౌత్ కాంట్రవర్సీ పోస్ట్
కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగచైతన్య – సమంత విడిపోడానికి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ కామెంట్స్ పైన కేటీఆర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తమకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ మాపై ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని కొండా సురేఖ అనలేదా అని ప్రశ్నించారు. తనకు కుటుంబం.. భార్య.. పిల్లలు లేరా అంటూ నిలదీసారు.
ముందుగా కొండా సురేఖ, సీతక్కలు సీఎం రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాలని వ్యాఖ్యానించారు. కొండా సురేఖపై సోషల్ మీడియా పోస్టింగ్‌లతో తమకు సంబంధం లేదని చెప్పారు. కొండా సురేఖ ఏడిస్తే మాకేమి సంబంధమని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కేసీఆర్‌ను తిట్టిపోయలేదా అని నిలదీసారు. చేతకాకనే కాంగ్రెస్ తమపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేకనే దాడులు చేయిస్తోందన్నారు.
Read Also: Railway Tracks : రైల్వే ట్రాక్‌ను పేల్చేసిన దుండగులు
సెక్యూరిటీ లేకుండా మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబులు మూసీ ప్రాంతంలో తిరగాలన్నారు. జగ్గారెడ్డి, మధు యాష్కీలు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. మూసీ బాధితుల కోసం రేపు (గురువారం) ఎల్బీనగర్‌కు వెళుతున్నామని.. కాంగ్రెస్ వాళ్ళుఅడ్డొస్తే ఏం చేయాలో అది చేస్తామన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యల పైన మాజీ మంత్రి సబితా స్పందించారు. వ్యక్తిగతంగా ఆర్దం లేని ఆరోపణలు చేయటం సరి కాదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు సరి కాదని..విధాన పరమైన అంశాల పైనే మాట్లాడాలని సూచించారు.