Site icon HashtagU Telugu

KTR: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు అంటూ కేటీఆర్ ప్రశంసలు

KTR praises CM Chandrababu for keeping his word

KTR praises CM Chandrababu for keeping his word

ktr praises over chandrababu naidu: పెన్షన్ పెంపుపై ఏపీ సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు చంద్రబాబు పెన్షన్ పెంచారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని ఆగ్రహించారు. తెలంగాణలో చిట్టినాయుడు సోదరుల కంపెనీ నడుస్తుందని నిప్పులు చెరిగారు. రైతు బంధు, భరోసా కాదు..సీఎం కుర్చి కే భరోసా లేదన్నారు. హైదరాబాద్ లో మనం క్లీన్ స్వీప్ చేసిన్నామన్నారు. బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలిచినామన్నారు. అందుకే రేవంత్ రెడ్డి నగర ప్రజల పై కక్ష కట్టారన్నారు. పేదల ఇండ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు.

Read Also: Tirumala Laddu Controversy : రోజాకు దిమ్మతిరిగే సమాధానము ఇచ్చిన నెటిజన్లు

సెటిల్మెంట్ లు జరిగే మాదాపూర్ లోని తిరుపతి రెడ్డి ఇంటిని ఎందుకు కూల్చట్లేదన్నారు. తిరుపతి రెడ్డి కి ఒక న్యాయం.. పెదవాళ్ళకి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. కోర్టులు పనిచేయని శనివారం ఆదివారం వచ్చి కూల్చుతున్నారని మండిపడ్డారు. హీరో నాగార్జున కన్వెన్షన్ కు కూల్చివేశారని గుర్తు చేశారు. దానికి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నే అన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులను ఎందుకు శిక్షించట్లేదు? అని ప్రశ్నించారు. పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చట్లేదన్నారు. మంత్రుల ఫామ్ హౌస్ లు ఎందుకు ముట్టు కోవట్లేదని మండిపడ్డారు. నగరంలో మేము లక్ష ఇండ్లు కట్టినామని క్లారిటీ ఇచ్చారు. హైడ్రా కూల్చిన పేదలకు ఆ లక్ష డబుల్ బెడ్ రూముల్లో కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read Also: Tirumala : టీటీడీ గత పాలకులు అసలు హిందువులే కాదు – రేసుగుర్రం విలన్

ఈరోజు శేరిలింగంపల్లి లో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో శేరిలింగంపల్లి లో ఉప ఎన్నిక వస్తుందని హెచ్చరించారు. మంత్రి శ్రీధర్ బాబు తెలివిగా మాట్లాడు తున్నాడన్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు అని శ్రీధర్ బాబు అంటున్నాడని తెలిపారు. మా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పడం చూడలేదా అని ప్రశ్నించారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.

Read Also: Minister Sitakka : గవర్నర్‌తో మంత్రి సీతక్క భేటీ.. కీలక బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి