Site icon HashtagU Telugu

KTR : రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్‌ బహిరంగ లేఖ

KTR open letter to Revanth Reddy Govt

KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వానికి లేఖ(letter) రాశారు. ఈ క్రమంలోనే ఆయన దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల(New Laws)పై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. కొత్త న్యాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలన్నారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

We’re now on WhatsApp. Click to Join.

నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక ముఖ్యంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారుని గుర్తు చేశారు. ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న తెలంగాణ గడ్డ పైన నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్‌ చట్టాలను యథాతధంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమా? లేక తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా? అనే విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. కొత్త చట్టాల్లో ఉన్న నియంతృత్వ పూరిత సెక్షన్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలని సూచించారు. అంతేకాక ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరఫున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని కేటీఆర్‌ హెచ్చరించారు.

Read Also: spirituality: అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే ఈ పరిహారం పాటించాల్సిందే?