Site icon HashtagU Telugu

Konda Surekha : కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని సమంత ను ఫోర్స్ చేసిన నాగార్జున – మంత్రి కీలక వ్యాఖ్యలు

Ktr Samantha

Ktr Samantha

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ఫై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేసారు. నాగ చైతన్య – సమంత (Naga Chaitanya – SamanthaDivorce) విడిపోవడానికి కారణం కేటీఆర్ అని , N కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంత ను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేయడం తో.. నాగార్జున (Nagarjuna)..సమంత ను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఫోర్స్ చేసాడు..కానీ సమంత ఒప్పుకోలేదు…అలాంటి పని చేయనంటే..చేయనని తేల్చి చెప్పడం తో..కుటుంబంలో గొడవలు జరిగాయి. కేటీఆర్ దగ్గరికి వెళ్లకపోతే మా ఇంట్లో ఉండొద్దని నాగార్జున తెచ్చి చెప్పడంతో..ఆ పని చేయలేక సమంత విడాకులు తీసుకుంది. నాగ చైతన్య – సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అని తేల్చి చెప్పింది. రకుల్ ప్రీతీ సింగ్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే అని పలువురు హీరోయిన్స్ కు మత్తుమందు అలవాటు చేసింది కేటీఆరే అని సురేఖ తెలిపింది.

మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు చిత్రసీమ తో పాటు ఇటు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కొండా సురేఖ చెప్పిందట్లో ఎంత నిజం ఉంది..? ఎలాంటి ఆధారాలు ఉన్నాయి..? ఓ కన్వెన్షన్ కోసం నాగార్జున ఇంత దిగజారుతారా..? కొడుకు భార్య ను మరో వ్యక్తి దగ్గరికి పంపిస్తాడా..? ఇదేమైనా సినిమానా..? ఇలాంటి వ్యాఖ్యలు కొండా సురేఖ ఎలా చేసింది..? ఓ హోదా లో ఉన్న ఆమె..మరో మహిళా ఫై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఏంటి..? హీరోయిన్లు అంటే కేవలం అలాంటి పనులకేనా..? అని అభిమానులు , నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రజల్లో నమ్మకం పోగొట్టుకుంది. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరింత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై నాగార్జున , నాగ చైతన్య అండ్ సమంత వీరిలో ఎవరైనా స్పందిస్తారా..? అనేది చూడాలి. ఏది ఏమైనా ప్పటికీ మంత్రి చేసిన ఆరోపణల ఫై యావత్ సినీ ప్రముఖులు , సినీ లవర్స్ , అభిమానులు , ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Trivikram : పవన్‌తో పాటు త్రివిక్రమ్ కూడా తిరుమలలోనే.. దర్శనానంతరం త్రివిక్రమ్‌తో కలిసి బయటకి వచ్చిన పవన్ కూతుళ్లు..