KTR : మత్స్యకారుల జీవితాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మట్టి కొట్టింది: కేటీఆర్‌

KTR : రాష్ట్రంలో 20 వేల టన్నుల మత్స్య సంపద దిగుబడి తగ్గడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయనీ.. కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండాపోయాయని 'ఎక్స్‌' వేదికగా ఆరోపించారు.

Published By: HashtagU Telugu Desk
ktr comments on congress government

ktr comments on congress government

Congress Government :  కాంగ్రెస్‌ ప్రభుత్వం పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు అనుమతులు లేకుండానే టెండర్లు ఎలా పిలుస్తారని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. కోటి ఎకరాలకు నీరందిస్తున్న కాళేశ్వరంపై కమిషన్‌ వేశారు. ఇప్పుడు మీపై ఏ కమిషన్‌తో విచారణ చేయించాలని దుయ్యబట్టారు. మత్స్యకారుల జీవితాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మట్టి కొట్టిందన్నారు.

రాష్ట్రంలో 20 వేల టన్నుల మత్స్య సంపద దిగుబడి తగ్గడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయనీ.. కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండాపోయాయని ‘ఎక్స్‌’ వేదికగా ఆరోపించారు. మూసీ మురికిలో రూ.కోట్లు కుమ్మరించడంపై ఉన్న ప్రేమ.. జలాశయాల్లో జలపుష్పా(చేపలు)లను వదలడంలో లేదని విమర్శించారు. ఉపాధి లేక బోసిపోయిన బెస్తవాడలపై.. వారి దీన స్థితిపై ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదని పోస్టులో పేర్కొన్నారు.

Read Also:WhatsApp : 85 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకు ?

  Last Updated: 03 Nov 2024, 05:23 PM IST