KLH : అత్యుత్తమ విద్యార్థులకు అవార్డులు అందజేసిన కెఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్

ఇది కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌లలో సమగ్ర అవగాహన కలిగిన వ్యక్తులను పెంపొందించడానికి చూపే నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

Published By: HashtagU Telugu Desk
KLH Global Business School presents awards to outstanding students

KLH Global Business School presents awards to outstanding students

KLH: కెఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ తమ త్రయ్మాసిక స్టూడెంట్స్ అచీవ్‌మెంట్స్ అవార్డ్ వేడుక 2025ను ఉత్సాహంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం విద్యా, సహ-పాఠ్య మరియు అదనపు-పాఠ్యేతర విభాగాలలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి, గౌరవించడానికి ఒక వేదికగా పనిచేసింది. ఇది కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌లలో సమగ్ర అవగాహన కలిగిన వ్యక్తులను పెంపొందించడానికి చూపే నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అకడమిక్ ఎక్సలెన్స్ సర్టిఫికేట్, సహ-పాఠ్య కార్యకలాపాలలో అచీవ్‌మెంట్ సర్టిఫికేట్, ఎక్స్‌ట్రా-కరిక్యులర్ యాక్టివిటీలలో ఎక్సలెన్స్ సర్టిఫికేట్, అటెండెన్స్ సర్టిఫికేట్ మరియు ప్రతిష్టాత్మక స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సహా వివిధ విభాగాల కింద విద్యార్థులను సత్కరించారు. ఎంబిఏ , బీబీఏ, బిఎస్ సి. యానిమేషన్ & గేమింగ్, మరియు ఎంబిఏ ఫిన్‌టెక్ వంటి విభిన్న ప్రోగ్రామ్ ల నుండి విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేయబడ్డాయి.

Read Also: Samsung Galaxy Empowered : భూటాన్ బోధనా సంఘం కోసం ఇమ్మర్సివ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్ గ్యాలక్సీ ఎంపవర్డ్

సమగ్ర శ్రేష్ఠతను సూచించే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎంబిఏ 2వ సంవత్సరం నుండి బి. శ్రావ్య, మనీష్ సిర్కార్ మరియు నిశాంత్ కులకర్ణి (స్పెషల్ మెన్షన్) లకు ప్రదానం చేశారు; బీబీఏ 3వ సంవత్సరం నుండి రాకేష్ జాగర్లమోడి మరియు జాన్వి ధారా; బిబిఏ ఐటి 3వ సంవత్సరం నుండి హేమా సురవరపు మరియు అంకిత్ కుమార్ వుక్కల్కర్; మరియు బిఎస్ సి.. యానిమేషన్ 3వ సంవత్సరం నుండి తరుణ్ కిషన్ ఉన్నారు. విద్యార్థులను అభినందించిన , కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్ మాట్లాడుతూ, “విద్యాపరంగా మాత్రమే కాకుండా సామాజికంగా బాధ్యతాయుతంగా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మంచి వ్యక్తులను పెంపొందించడంను మేము విశ్వసిస్తున్నాము. అచీవర్స్ డే అనేది ఆ లక్ష్య సాకరం గుర్తించటానికి చేసే ఒక వేడుక – ఇక్కడ కృషి, సృజనాత్మకత మరియు క్రమశిక్షణ కలిసి వస్తాయి. అవార్డు గ్రహీతలందరినీ నేను అభినందిస్తున్నాను. ప్రతి విద్యార్థి జీవితంలోని అన్ని కోణాలలో రాణించడానికి కృషి చేస్తూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాను” అని అన్నారు.

కెఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్‌లో జరిగిన అచీవర్స్ డే వేడుక విద్యార్థులు మరియు అధ్యాపకులపై శాశ్వత ముద్ర వేసింది. కేవలం అవార్డుల కార్యక్రమం కంటే, ఇది క్యాంపస్ అంతటా శ్రేష్ఠత, క్రమశిక్షణ మరియు సమగ్ర అభివృద్ధి సంస్కృతిని బలోపేతం చేసింది. విద్యార్థులు తగిన గుర్తింపుతో వెళ్తున్న వేళ, వారు తమతో పాటు కొత్త ఉద్దేశ్యం, సంకల్పం మరియు గర్వాన్ని తీసుకువచ్చారు. డీన్ డాక్టర్ ఆనంద్ బేతపూడి పర్యవేక్షణలో, ఈవెంట్ కన్వీనర్ డాక్టర్ జయ వాణి మజుందార్, అధ్యాపక సభ్యులు మరియు సిబ్బంది అంకితభావంతో, ఈ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది, అంతటా దాని ప్రేరణాత్మక స్వరం మరియు గొప్పతనాన్ని కొనసాగించింది. కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన కె ఎల్ హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్, జ్ఞానం కలిగిన, విలువలతో నడిచే మరియు వేగంగా మారుతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్న ప్రపంచ పౌరులను సృష్టించాలనే దాని లక్ష్యం ముందుకు తీసుకువెళుతోంది.

Read Also: Fire Accident : అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షలు ఇవ్వాలి – కేటీఆర్ డిమాండ్

  Last Updated: 19 May 2025, 03:25 PM IST