KL Deemed to be University : పర్యావరణ పరిరక్షణ మరియు ఇంధన సామర్థ్యం పరంగా చేసిన అత్యుత్తమ కృషికి గానూ కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ గుర్తింపు పొందింది, 5వ గ్రీన్ ఉర్జా & ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డ్స్ 2024లో ప్రతిష్టాత్మకమైన “ఎనర్జీ ట్రాన్సిషన్ ఎక్సలెన్స్ అవార్డు – అకాడెమియా”ను అందుకుంది. కోల్‌కతాలోని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసిసి), నాలెడ్జ్ పార్టనర్‌గా డెలాయిట్ భాగస్వామ్యంతో నిర్వహించబడిన కార్యక్రమంలో పొందిన ఈ అవార్డు పునరుత్పాదక ఇంధనం మరియు పర్యావరణ పరిరక్షణ పట్ల విశ్వవిద్యాలయం యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది.
Read Also: TG Govt : రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి ఒప్పందం
గ్రీన్ ఉర్జా & ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డులు సస్టైనబల్ ఇంధన భవిష్యత్తు వైపు నడిపించే సంస్థలు మరియు వ్యక్తులను సత్కరిస్తాయి . న్యూఢిల్లీలోని లీ మెరిడియన్‌లో జరిగిన ఈ వేడుకలో, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను ఏకీకృతం చేయడం, సస్టైనబుల్ కార్యక్రమాలను పెంపొందించడం మరియు విద్యారంగంలో ఇంధన పరిరక్షణను ప్రోత్సహించడంలో దాని మార్గదర్శక ప్రయత్నాలకు కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీని గుర్తించింది.
ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ శక్తి శాఖ మాజీ కార్యదర్శి అనిల్ రజ్దాన్ IREDA మాజీ CMD KS పాప్లి, SECI మాజీ MD & TERI మాజీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ అశ్విని కుమార్ మరియు పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB) చైర్మన్ శ్రీ అనిల్ జైన్ సహా ప్రముఖులు హాజరయ్యారు. KL డీమ్డ్ టు బీ యూనివర్సిటీ P&D డీన్ డాక్టర్ వల్లంకి రాజేష్ ఈ గౌరవాన్ని అందుకోవడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “ఈ గుర్తింపు పర్యావరణ పరిరక్షణ , ఆవిష్కరణల పట్ల మా నిబద్ధతకు నిదర్శనం. మేము పర్యావరణ అనుకూల భవిష్యత్తుకు దోహదపడే మరియు మా ఇంధన పరిరక్షణ ప్రయత్నాలలో కొనసాగే అత్యాధునిక ఇంధన పరిష్కారాలను నిరంతరం అమలు చేస్తాము” అని అన్నారు.
పునరుత్పాదక ఇంధన స్వీకరణలో ఒక ఉదాహరణగా నిలుస్తూ, విశ్వవిద్యాలయం తన క్యాంపస్ ఇంధన అవసరాలలో 45% సౌర మరియు పవన విద్యుత్ ద్వారా పొందుతుంది. ఇది మొత్తం 3,281.5 kWp సామర్థ్యంతో పైకప్పు సౌర ఫలకాలను మరియు 61.2 kWp సామర్థ్యంతో విండ్ టర్బైన్లను ఏర్పాటు చేసింది. కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణ పరంగా అనేక ప్రశంసలను అందుకుంది, వాటిలో 2024లో విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బిఇఇ) ప్రదానం చేసిన ఆల్-ఇండియా స్మార్ట్ క్యాంపస్ ఇన్నోవేషన్ అవార్డు ఫర్ ప్రొఫెషనల్స్ , 4వ గ్రీన్ ఉర్జా & ఎనర్జీ ఎఫిషియెన్సీ అకాడెమియా ఎక్సలెన్స్ అవార్డు 2023 (ఐసిసి), ఎనర్జీ ఎఫిషియంట్ కమర్షియల్ బిల్డింగ్స్ అప్రిసియేషన్ అవార్డు 2023 (సిఐఐ), మరియు ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ – విన్నర్ 2022 (సిఐఐ) ఉన్నాయి.
Read Also: CM Chandrababu : స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ : సీఎం