Cop Locks Women: మహిళను బంధించి, చితకబాదిన పోలీస్, వీడియో వైరల్!

శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు (Police Officers) ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ప్రవహిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Viral video

Viral

సమాజ్‌వాదీ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ (Viral Video) గా మారింది. 2 నిమిషాలున్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాన్పూర్‌ (kanpur) లోని కక్వాన్ ప్రాంతంలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫీసర్‌ కోపం ఊగిపోతూ మహిళను చావబాదాడు. అసభ్యంగానూ ప్రవర్తించాడు. ఎస్ఐ (Police Officer) క్రూరత్వాన్ని వీడియోలో చూడొచ్చు. చుట్టుపక్కలవారు వద్దని వేడుకుంటున్నా గదిలో బంధించి తీవ్రంగా కొట్టాడు. “గదిలో ఎందుకు బంధించారు. ఎందుకు కొడుతున్నారు’’ అని ప్రశ్నించినా ఏమాత్రం జాలి చూపలేదు. పోలీస్ అధికారి (Police Officer) చేతిలో దెబ్బలు తిన్న మహిళ  ‘నన్ను కొడుతున్నాడు, హింసిస్తున్నాడు” అని కేకలు వేసింది.

మరోవైపు ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. కాన్పూర్ పోలీసుల (Police Officer) అవమానకర చర్య అని పార్టీ ట్వీట్ చేసింది. ప్రతిరోజూ యోగి (CM Yogi) ప్రభుత్వ పోలీసులు ప్రజలపై దౌర్జన్యం చేస్తున్న వీడియోలు బయటకొస్తున్నాయి. కాని ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు. ఈ విషయంపై విచారణ జరిపి పోలీసుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది సమాజ వాదీ పార్టీ.

Also Read: Nikhat Zareen: ఉమెన్స్ నేషనల్ టైటిల్ ఛాంపియన్ గా నిఖత్ జరీన్!

  Last Updated: 26 Dec 2022, 02:59 PM IST